MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలకు ఏ వయసులో డబ్బు ఆదా చేయడం గురించి నేర్పించాలి?

పిల్లలకు ఏ వయసులో డబ్బు ఆదా చేయడం గురించి నేర్పించాలి?

డబ్బు ఆదా చేయడం గురించి పిల్లలకు చిన్నతనంలోనే నేర్పాలి. అప్పుడే పిల్లలు అనవసరంగా ఖర్చు చేయరు. మరి పిల్లలకు ఏ వయసులో డబ్బు ఆదా చేయడం గురించి నేర్పించాలో తెలుసా?   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 12 2024, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నగున్పప్పుడే ఏది మంచి? ఏది చెడు? వంటి విషయాలను చెప్తుంటారు. నిజానికి పిల్లలకు కొన్ని విషయాలను చిన్నప్పటి నుంచే చెప్పాలి. అప్పుడే పిల్లలు మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. చెడు వాటికి దూరంగా ఉంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఆదా చేయడం గురించి మాత్రం నేర్పరు. అందులోనూ పిల్లలు అడిగింది లేదనకుండా ప్రతీది కొనిస్తుంటారు. పిల్లల అవసరాలను తీర్చడంలో తప్పు లేదు. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మాత్రం నేర్పకూడదు. ఇది వారిని డబ్బు ఆదా చేయకుండా చేస్తుంది. నిజానికి పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు డబ్బు ఆదా చేయడం గురించి ఖచ్చితంగా నేర్పాలి. అది ఏ వయసులో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


పిల్లలకు డబ్బు ఆదా చేయడం ఏ వయసులో నేర్పించాలి?

చిన్న పిల్లలకు అంటే  4 సంవత్సరాల నుంచి డబ్బు పొదుపు చేసే అలవాటు గురించి ఖచ్చితంగా నేర్పించాలి. దీనివల్ల మీ పిల్లలు 7 నుంచి 8 సంవత్సరాల వయస్సులో మీ నుంచి పనికిరాని వస్తువులను కొనియ్యమని బలవంతం చేయరు. దీనివల్ల డబ్బు విలువను మీ బిడ్డ తెలుసుకుంటాడు. అనవసరంగా డబ్బును ఖర్చు చేయడం మానుకుంటాడు. 

35
money saving

money saving

అవసరం గురించి చెప్పండి

తల్లిదండ్రులు పిల్లలు అడిగిన ప్రతి దాన్ని అంటే అవసరం లేని వస్తువులను కొనిచ్చే అలవాటును మానుకోవాలి. మీ పిల్లలు డబ్బు విలువను తెలుసుకోవాలంటే వారికి అవసరమైన దాన్ని మాత్రమే కొనివ్వండి. అలాగే అవసరానికి, కోరికకు మధ్య తేడా గురించి మీ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పండి. ఏవైనా సరుకులు అవసరం అయితే వాటిని మాత్రమే కొనుగోలు చేయండి. పిల్లలకు లేనిపోని కోరికలు ఉంటాయి. వీటిలో చాలా మటుకు అవసరానికి రానివే ఉంటాయి. కాబట్టి వారి అవసరాన్ని మాత్రమే తీర్చండి. అవసరానికి మించి మాత్రమే కొనే అలవాటును వారికి నేర్పండి. 

45
Image: Getty

Image: Getty

డబ్బు విలువను వివరించండి

చిన్నతనంలోనే పిల్లలకు డబ్బు విలువను ప్రతి తల్లిదండ్రులు తెలియజేయాలి. ఇందుకోసం పిల్లలకు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పండి. ఆ పనులు చేసినందుకు వారికి కొంత డబ్బు ఇవ్వండి. ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో.. డబ్బు కోసం వారు ఎంత కష్టపడాలో దీనిద్వారా తెలుసుకుంటారు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటారు. దీనివల్ల అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.

55

పిగ్గీ బ్యాంకులను కొనుగోలు చేయండి

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా పిగ్గీ బ్యాంకులు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీ పిల్లలకు డబ్బును ఆదా చేయడం నేర్పుతుంది. మీరు వారికి డబ్బు ఇచ్చినప్పుడల్లా వారికి ఆ డబ్బును పిగ్గీ బ్యాంకులో వేయమని చెప్పండి. దీనివల్ల మీ పిల్లలు చిన్న వయస్సు నుంచే పొదుపు గురించి ఆలోచిస్తారు. మీరు కావాలనుకుంటే మీరు పిగ్గీ బ్యాంక్ డబ్బుతో వారి కోసం వస్తువులను కూడా కొనండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved