పిల్లలకు టీ, కాఫీలు ఇవ్వొచ్చా..? ఇస్తే ఏమౌతుంది..?
అసలు పిల్లలు టీ, కాపీలు తాగొచ్చా..? అది వారి ఆరోగ్యానికి మంచిదేనా..? లేక నష్టం కలుగుతుందా..? దాని వల్ల కలిగే నష్టం ఏంటి..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Tea and coffee drinkers for children
ఉదయం లేవగానే కడుపులో వేడిగా టీ, లేదంటే కాఫీ పడితే ఆహా.. ఎంత హాయిగా ఉంటుంది. మనలో చాలా మందికి ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. కొందరికి అయితే.. టైమ్ కి టీ, కాఫీ పడకపోతే.. తలనొప్పి కూడా వచ్చేస్తుంది. రోజుకి మూడు, నాలుగు సార్లు టీలు, కాఫీలు తాగే వారు కూడా ఉన్నారు. అయితే... వాళ్లు తాగడమే కాదు... కొందరు పేరెంట్స తమ పిల్లలకు కూడా ఇదే అలవాటు నేర్పుతూ ఉంటారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఒకే కానీ... మరీ చిన్న పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటారు.
అసలు పిల్లలు టీ, కాపీలు తాగొచ్చా..? అది వారి ఆరోగ్యానికి మంచిదేనా..? లేక నష్టం కలుగుతుందా..? దాని వల్ల కలిగే నష్టం ఏంటి..? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ, కాఫీల్లో టానిన్స్ , ఫైటేట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల.. ఐరన్, కాల్షియం పిల్లల్లో లోపిస్తుంది. దాని వల్ల పిల్లల్లో రక్త హీనత పెరుగుతుంది. వాళ్ల ఎముకలు కూడా చాలా వీక్ గా ఉంటాయి. అంతేకాదు.. టీ, కాఫీలు సహజంగా ఎసిడిక్ రియాక్షన్ తో ఉంటాయి. వీటిని కనుక పిల్లలు తాగితే.. వారికి ఇతర జీర్ణ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అసలే.. పిల్లలు తీసుకునే ఆహారం అంతంత మాత్రంగా ఉంటుంది. దానికి తోడు ఇవి కూడా తోడు అయితే... తీసుకున్న ఆహారం అరగక ఇబ్బంది పడతారు.
అంతేకాకుండా.. చిన్న పిల్లలు టీ, కాఫీలు తాగడం వల్ల వారి దంతాల్లో కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ అనేది స్ట్రాంగ్ సిమెనిన్.. దీని వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్ గా మారిపోతారు.
Tea Coffee Drinks
అంతేకాకుండా... పిల్లల నిద్రపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిజానికి పిల్లలు ఎక్కువగా నిద్రలోనే మంచిగా ఎదుగుదారు. సరిగా నిద్రపోయే పిల్లల్లోనే శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. మీరు కనుక ఈ టీలు, కాఫీలు ఇవ్వడం వల్ల.. వారి నిద్రపై ప్రభావం పడి.. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది.
అంతేకాకుండా.. పిల్లలు ఈ టీలు, కాఫీలకు అలవాటు పడితే సరిగా భోజనం చేయలేరు. వారి ఆకలి కూడా చచ్చిపోతుంది. అసలు ఆహారంపై శ్రద్ధ చూపించరు. కాబట్టి... పిల్లలు టీ, కాఫీలు కావాలని మారం చేసినా.. వారికి ఇవి ఇవ్వకండి. వారికి పాలు లేదంటే.. పండ్ల రసాలు ఇవ్వండి.