Parenting: విరాట్, అనుష్క నుంచి ప్రతి పేరెంట్స్ నేర్చుకోవాల్సినది ఇదే
ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తాము ఆఫీసు పనితో బిజీగా ఉన్నామని అసలు పిల్లల్నే పట్టించుకోవడం లేదు. కానీ, విరాట్, అనుష్క మాత్రం తమ పిల్లలు తినే భోజనం కూడా స్వయంగా వారే వంట చేస్తారని మీకు తెలుసా?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీకి పరిచయం అవసరం లేదు.ఒకరు క్రికెట్ లో స్టార్ ప్లేయర్ అయితే, మరొకరు బాలీవుడ్ ని ఏలిన అందాల తార. వీరిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కానీ, ఎంత బిజీగా ఉన్నా కూడా వారు తమ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తాము ఆఫీసు పనితో బిజీగా ఉన్నామని అసలు పిల్లల్నే పట్టించుకోవడం లేదు. కానీ, విరాట్, అనుష్క మాత్రం తమ పిల్లలు తినే భోజనం కూడా స్వయంగా వారే వంట చేస్తారని మీకు తెలుసా? మరి, ఈ జంట నుంచి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.అవేంటో చూద్దాం...
పిల్లలను సంస్కృతి, సంప్రదాయాలతో పెంచడానికి , అనుష్క, విరాట్ ఇద్దరూ కలిసి తమ పిల్లల కోసం వంట చేస్తున్నారు. కోట్లకు అధిపతులైనా వారే వంట ఎందుకు చేస్తున్నారో , దాని వెనక కారణాన్ని కూడా అనుష్క వివరించారు.
కోట్లు సంపాదించే విరాట్, అనుష్కలకు స్పెషల్ గా కుక్ ని పెట్టుకొని తమ పిల్లలకు కావాల్సిన ఆహారం వండించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ వారే స్వయంగా వండి తినిపించాలి అనుకోవడానికి మాత్రం పెద్ద కారణమే ఉంది.గతేడాది ముంబైలో జరిగిన కార్యక్రమంలో అనుష్క, విరాట్ మాట్లాడుతూ, తమ తల్లులు తమ కోసం చిన్నతనంలో వండిన వంటకాలనే తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలి అనుకున్నామని చెప్పారు. తమ తల్లిదండ్రులు తమకు పెట్టిన ఆహారం తమ పిల్లలకు పెట్టకపోతే ఆ తరం వంటకాలు అంతరించిపోతాయని, అందుకే తమ తల్లులు చెప్పిన వంటలు తామే చేస్తున్నామన్నారు.
మీ ఆహారం మీరే వండుకోవాలి
తమ తల్లులు వండినట్టే తాము కూడా పిల్లలకు వండుతామని అనుష్క చెప్పారు. ప్రతి వంటకానికి తన తల్లికి ఫోన్ చేసి అడుగుతానని చెప్పింది.
ఎందుకు ఈ నిర్ణయం?
తమ తల్లులు వండిన వంటకాలు చేయడం ద్వారా పిల్లలకు ప్రత్యేకమైన వాటిని అందిస్తున్నామని, తద్వారా వారు తమ తర్వాతి తరానికి కూడా ఈ వంటకాలను అందించగలరని అనుష్క చెప్పింది.
పిల్లలకు ఇంకేం నేర్పించాలి?
విరాట్, అనుష్క తమ పిల్లలకు తమ బాల్యపు రుచులు, వంటకాలు నేర్పించాలనుకున్నట్టే, మీరు కూడా మీ పిల్లలకు మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలు నేర్పించవచ్చు.
వంట కావచ్చు, అలవాటు కావచ్చు
మీ బాల్యంలోని ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని మీ పిల్లలకు నేర్పించవచ్చు. ఉదాహరణకు మీరు చేసిన వంటకం, మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న మంచి అలవాట్లు వంటివి నేర్పించవచ్చు. దీని ద్వారా మీ సంప్రదాయాన్ని మీ పిల్లలకు, తర్వాతి తరానికి అందించవచ్చు.