పిల్లల విషయంలో ముందు పేరెంట్స్ మార్చుకోవాల్సినది ఇదే..!
ముఖ్యంగా మన భారతీయులు పిల్లల విషయంలో, వారి జీవితం, కెరీర్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారట. అందుకే.. వారు కొన్ని మార్పులు చేసుకుంటేనే.. వారి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
తమ పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు తమ శాయశక్తులా కష్టపడతారు. తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని తాపత్రయపడతారు. వారికి కావాల్సింది అడగకముందే కొని ఇచ్చే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. పిల్లల జీవితం బాగుండాల్సిందే.. పేరెంట్స్ లో కొన్ని మార్పులు రావాలని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా మన భారతీయులు పిల్లల విషయంలో, వారి జీవితం, కెరీర్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారట. అందుకే.. వారు కొన్ని మార్పులు చేసుకుంటేనే.. వారి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందో ఇప్పుడు చూద్దాం..
మనమందరం సమాజంలోనే ఉన్నాం. నలుగురితో కలిసే బుతుకుతున్నాం. కానీ... చుట్టూ ఉండే నలుగురి కోసం బతకడం లేదు అనే విషయాన్ని పేరెంట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే.. దాదాపు పేరెంట్స్ ప్రతి విషయంలో.. అందరూ ఏమనుకుంటారు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. వారు వాడటమే కాకుండా.. పిల్లలపై ఆమాటను రుద్దుతూ ఉంటారు. నవ్వు ఇలా చేస్తే.. అందరూ ఏమనుకుంటారు..? అందరూ నవ్వుతారు.. ఇలాంటి వాడుతూ ఉంటారు. ముందు.. ఈ మాట మాట్లాడటం ఆపేస్తే బెటర్.
ఇక దాదాపు ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే... నాకు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని ఉండేది.. అవ్వలేకపోయాను.. కనీసం నా కొడుకుని అయినా డాక్టర్ చేయాలి అనుకుంటూ ఉంటారు. మీ కోరికలు, మీ ఫాంటసీలను పిల్లలపై ఎందుకు రుద్దుతున్నారు..? ముందు మీ పిల్లలకు ఏది ఇంట్రస్ట్..? వాళ్లు ఏమి అవ్వాలి అనుకుంటున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో పేరెంట్స్ కచ్చితంగా మారాలి.
ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే... పిల్లలకు అడగకుండానే అన్ని బహుమతులు ఇస్తూ ఉంటారు. అదే గొప్ప పేరెంటింగ్ అనుకుంటూ ఉంటారు. కానీ బహుతులు ఇవ్వడంలో తప్పులేదు కానీ,.. అంతకంటే ఎక్కువగా మీరు మీ పిల్లలకు టైమ్ ఇవ్వాలి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయంలో కచ్చితంగా పేరెంట్స్ మారాల్సిందే. ఇప్పుడు మీరు మీ పిల్లలతో ప్రేమగా ఉంటూ.. వారితో సమయం గడిపినప్పుడే.. మీరు ముసలివాళ్లు అయినప్పుడు.. వారు మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు.
చాలా మంది పేరెంట్స్.. పిల్లలు ఏదో విషయం చెప్పాలి అనుకుంటే వినరు. ఒక వేళ విన్నా.. తీసేసినట్లు, తక్కువ చేసినట్లు, అది అసలు గొప్ప విషయం కాదు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అది చాలా పెద్ద తప్పు. వాళ్లు చెప్పేది చిన్నదైనా, పెద్దది అయినా.. ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి.
పిల్లలకు స్కూల్లో, చుట్టు పక్కల ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సరే.. తల్లిదండ్రులు కూడా స్నేహితుల్లాగానే ఉండాలి. మనం వారికంటే పెద్ద అనే అహంభావం చూపించకుండా.. వారితో ఫ్రెండ్లీ గా మెలగడానికి ప్రయత్నించాలి.
పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వారు జీవితంలో ఫెయిల్ అయిపోరు. ఈ విషయం ఇండియన్ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన నిజం. పిల్లలకు మార్కులు రాలేదని కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. మార్కులను అసలు.. పిల్లల టాలెంట్ తో పోల్చనే కూడదు.
చాలా మంది పేరెంట్స్ చేసే అతి పెద్ద తప్పు ఇది. ఎప్పుడూ తమ పిల్లలను ప్రతి విషయంలో ఇతర పిల్లలతో పోలుస్తూ ఉంటారు. దానిని ముందు ఆపేయాలి. అందరు పిల్లలు ఒకేలా ఉండరు. ఆ విషయం తెలుసుకోవాలి. ఒకరితో పోల్చడం వల్ల మీ పిల్లలు మరీ తక్కువ అయిపోతారే తప్ప.. గొప్పగా మారిపోరు.
ఇక చాలా మంది ఈ వయసులో తాము అది చేసేశాం.. ఇది చేసేశాం అని మాట్లాడుతూ ఉంటారు. మీ జనరేషన్ కీ, ఈ జనరేషన్ కీ గ్యాప్ ఉందనే విషయం అర్థం చేసుకొని... వారు ఏం చేయగలరో అదే చెయ్యనివ్వాలి. ఈ విషయాల్లో పేరెంట్స్ మారితే.. నిజంగా పిల్లల భవిష్యత్తు అద్భుతంగానే ఉంటుంది.