లావుగా ఉన్న పిల్లలు బయటి ఫుడ్ తినకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చేయాల్సిందే ఇదే..!
టీవీ యాడ్ లో జంక్ ఫుడ్ గురించి యాడ్స్ వస్తూనే ఉంటాయి. వీటిని చూసిన పిల్లలు అవి కావాలని మారం చేస్తుంటారు. కానీ వీటిని తింటే పిల్లలు మరింత బరువు పెరిగి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
obesity in children
టీవీ యాడ్ లో చూపించే జంక్ ఫుడ్ యాడ్స్ పిల్లలకు తెగ నచ్చుతాయి. అంతేకాదు అవి కావాలని పట్టుబడుతుంటారు కూడా. కానీ జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ముఖ్యంగా ఇప్పటికీ బరువు ఎక్కువగా ఉన్న పిల్లలకు. మీకు తెలుసా? స్థూలకాయం ఉన్న పిల్లలు, ముఖ్యంగా 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారట. స్థూలకాయులైన పిల్లలు జంక్ ఫుడ్ ను తినకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదే.
obesity
ఊబకాయం ఉన్న పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీళ్లకు రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు, అధిక రక్తపోటు, నిద్ర రుగ్మతలు, కీళ్ల నొప్పులు, ఉబ్బసం, గుండె జబ్బులతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. మరి తల్లిదండ్రులు పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పౌష్టికాహారం
ప్రతి పేరెంట్స్ పిల్లలకు హెల్తీ ఫుడ్ పై విసుగు కలిగించకూడదు. అందుకే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్తీ ఫుడ్స్ తో టేస్టీ టేస్టీగా ఏదో ఒక వెరైటీ చేసి పెట్టండి. ఒకవేళ మీ పిల్లలు కూరగాయలు తినకపోతే వాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని హెల్తీగా తయారుచేయండి. లేదా కూరగాయల ప్యూరీని పాస్తా సాస్గా ఉపయోగించండి. కూరగాయలు లేదా పండ్లను పెరుగు, సల్సా లేదా హమ్మస్ తో కలిపి ఇవ్వండి. అలాగే ఫుడ్ కలర్ ఫుల్ గా కనిపించడానికి రకరకాల పండ్లతో డెకరేట్ చేయండి.
obesity in children
తల్లిదండ్రులు సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి
పిల్లలు పేరెంట్స్ ప్రవర్తనను బాగా గమనిస్తారు. అలాగే చేస్తారు. అందుకే తల్లిదండ్రులుగా మీరు హెల్తీ ఫుడ్ ను తినండి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్స్ ను అస్సలు తినకండి. మీ పిల్లలు మిమ్మల్నే ఫాలో అవుతారు కాబట్టి మంచి ఆహారాలను తినండి.
Obesity in children
ప్రోటీన్ ఫుడ్
ప్రోటీన్ ఫుడ్ మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కండరాలు పెరగడానికి, పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. అంతేకాదు ఆకలి ఎక్కువ కాకుండా కూడా చేస్తుంది. మీ పిల్లలకు మంచి ప్రోటీన్ ఫుడ్ ను పెడితే వారికి జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. అందుకే మీ పిల్లలకు పాలు, గుడ్లు, మొలకలు, క్వినోవా, సోయా, కాయధాన్యాలు, విత్తనాలు, కాయలు, పౌల్ట్రీ, చేపలు వంటి ప్రోటీన్లు ఉండే ఆహారాలను పెట్టండి. మరొక ముఖ్యమైన విషయం పిల్లలకు హెల్తీ స్నాక్స్ నే పెట్టాలి.