పిల్లలు ప్రతి దానికీ కంప్లైంట్స్ చేస్తున్నారా? కారణం ఇదే
మీ పిల్లలు ప్రతి విషయంలో ప్రతిదానికీ ఫిర్యాదు చేస్తున్నారా? అయితే.. వారిని తిట్టడానికి బదులు దాని వెనక కారణం అర్థం చేసుకోవాలట.
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా ఏదో ఒక విషయంలో కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. బయట ఆడుకోవడానికి వెళ్లినా, స్కూల్లో చదువుకోవడానికి వెళ్లినా.. ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు.వాళ్లు అది చేశారు.. ఇది చేశారు అని అంటూ ఉంటారు. అయితే.. పిల్లలు అలా ఫిర్యాదు చేసినప్పుడల్లా.. వారిపై కోపం తెచ్చుకోకుండా... దాని వెనక కారణాన్ని తెలుసుకోవాలట. పిల్లలు అలా ఫిర్యాదులు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...
పిల్లల్లో కృతజ్ఞతను పెంపొందించడం
పిల్లలు ఫిర్యాదు చేయడానికి కారణాలు:
శ్రద్ధ కోసం:
తరచుగా ఫిర్యాదు చేసే పిల్లలు శ్రద్ధ కోసం అలా చేస్తారు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు తమ మాట వినాలని, సమస్యను పరిష్కరించాలని కోరుకుంటారు.
ఆటల్లో చిన్న గొడవలు:
పిల్లలు ఆడుకునేటప్పుడు చిన్న గొడవలు సహజం. దీని ద్వారా వారు చాలా నేర్చుకుంటారు. కాబట్టి, వారు ఫిర్యాదు చేస్తే పెద్ద విషయం చేయకండి. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
అసంతృప్తి:
కొన్నిసార్లు పిల్లలు అసంతృప్తిగా ఉంటారు. దీనివల్ల వారు తరచుగా ఫిర్యాదు చేస్తారు. వారు దేనితో అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
అర్థం చేసుకోండి:
పిల్లలు తరచుగా ఫిర్యాదు చేస్తే, వారికి ఏదైనా సమస్య ఉందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల వారు తమ అలవాటును మార్చుకుంటారు.
పేరెంటింగ్ చిట్కాలు
స్వీయ-అభివృద్ధి:
తల్లిదండ్రులు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు పిల్లలు తరచుగా ఫిర్యాదు చేస్తారు. ఆ సమయంలో వారిపై కోపగించడం తప్పు. పిల్లల ముందు ఎవరినీ తప్పు పట్టకండి. బదులుగా మీ ప్రవర్తనను మార్చుకోండి.
గుర్తుంచుకోండి:
సాధారణంగా పిల్లలు 7 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల నుండి చాలా నేర్చుకుంటారు. కాబట్టి, ఈ వయస్సులో పిల్లలు చెప్పేది విని, ఎవరినీ బాధపెట్టకుండా పరిష్కారం కనుక్కోవాలి. చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లల చర్యలను నిందించడం తప్పు. పిల్లలతో ప్రేమగా మాట్లాడండి.