పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలి...?
వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తాయట. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా.. ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది.
grandparents day
ఒకప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంత మంది పిల్లలు పుట్టినా.. ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి.. పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా.. తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా.. పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు. కానీ.. ఇప్పుడు అలా కాదు.. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్లలో ఉంటే.. పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ, నానమ్మల ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ.. పిల్లల పెంపకంలో కచ్చితంగా.. గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు పెరగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1.పిల్లలకు కేవలం ఒక వైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు..రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ-తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుంతో..నానమ్మ-తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉండాలి. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తాయట. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా.. ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది.
Grandparents
2.పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు. కానీ.. గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్ కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాదు.. మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది.
grandparents
3.మన కుటుంబ చరిత్ర గ్రాండ్ పేరెంట్స్ కి మించి ఎవరికి బాగా తెలుస్తుంది..? అంతేకాదు.. మన కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు పేరెంట్స్ కంటే.. గ్రాండ్ పేరెంట్సే బాగా నేర్పించగలరు. పిల్లలకు అర్థమయ్యేలా వివరించగలరు.
4.పేరెంట్స్ ఆఫీసు పనులతో హడావిడిగా ఉంటారు. పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా.. అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది. వాళ్లు.. మనకు లైఫ్ లెసెన్స్ నేర్పిస్తారు. వారి అనుభవాలు పంచుకుంటారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి.
5.పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్లు పిల్లలను ఎప్పుడూ సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరం అయితే.. గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది. మధురమైన జ్నాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
grandparents _children
6.గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొక్కటే కాదు.. గార్డెనింగ్.. లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు.
Grandparents
పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా.. వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా.. అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా.. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే.