Parenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు మార్చుకుంటే ఏమౌతుంది?
ఎదుగుతున్న పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు విప్పడం, మార్చుకోవడం లాంటివి చేస్తే ఏమౌతుంది?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలని, వారి జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపరచడానికి ఏమి చేయాలా అని పేరెంట్స్ ఆలోచిస్తూనే ఉంటారు. తమ పిల్లలు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలని కూడా కోరుకుంటారు. అయితే, ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే.. పిల్లల ముందు పేరెంట్స్ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. మరి, అవేంటో తెలుసుకుందామా..
చూడటం నేర్చుకుంటారు:
తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల ముందు దుస్తులు మార్చడం మంచిది కాదు. ఎంత చిన్న పిల్లలైనా సరే, పిల్లలు కూడా ఎప్పుడూ దుస్తులు మార్చుకోకూడదు. ముఖ్యంగా రెండు సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు తమ చుట్టూ జరిగే విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు, వాటిని అనుసరిస్తారు. ఈ కారణంగానే మీరు మీ పిల్లల ముందు దుస్తులు మార్చకూడదని చెబుతారు.
గోప్యత..
వ్యక్తిగత స్థలంలోనే తల్లిదండ్రులు దుస్తులు మార్చుకోవాలి. దీని ద్వారా మీ పిల్లలకు గోప్యత ప్రాముఖ్యతను నేర్పించినవారు అవుతారు.. ఇది కాకుండా, వారి శరీరాన్ని ఎవరూ చూడకూడదని తెలుసుకుంటారు. లేకపోతే వారు కూడా అందరి ముందు దుస్తులు విప్పడం, వేసుకోవడం లాంటివి చేస్తారు.
గందరగోళానికి గురికావచ్చు:
చిన్న పిల్లల ముందు తల్లిదండ్రులు బట్టలు మార్చినప్పుడు పిల్లలు గందరగోళానికి గురికావచ్చు లేదా అసౌకర్యంగా ఫీలవ్వచ్చు. కాబట్టి పిల్లల ముందు దుస్తులు మార్చడం మానుకోండి.
హద్దులు ఏర్పాటు చేయడం:
దుస్తులు మార్చుకోవడం చుట్టూ హద్దులు పెట్టడం అవసరం అనే విషయం పిల్లలకు అర్థం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో, ఇతరులు చూస్తున్నప్పుడు దుస్తులు మార్చుకోవడం మంచిది కాదు అనే విషయం పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. అప్పుడు పిల్లలకు ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయం తెలుస్తుంది.