చలికాలంలో గర్భిణులు ఎలాంటి ఆహారాలను తింటే మంచిది..?
మెంతుల్లో ఇనుము, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టు పెరుగుదలకు అవసరమైన మఖ్యమైన పోషకాలు. మెంతులతో రకరకాల హెయిర్ ప్యాక్ లను చేసి పెడితే.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. కడుపులో పెరుగుతున్న బిడ్డ, తల్లీ ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే పోషకాలను పుష్కలంగా తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు స్త్రీల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో వీళ్లు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ పైనే వీళ్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
pregnancy
ఒక నివేదిక ప్రకారం.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు అదనంగా 300 కేలరీలను తీసుకోవాలి. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో. సమతుల్య, మంచి పోషకారం తల్లుల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అంటువ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ చలికాలంలో గర్భవతులు తప్పకుండా తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుందాం పదండి..
curd
పెరుగు
గర్భిణులకు కాల్షియం నిల్వలు చాలా అవసరం. ఎందుకంటే ఇది గర్భంలోని పిండం శరీర నిర్మాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకలను నిర్మించడానికి అవసరపడుతుంది. పాల ఉత్పత్తుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ల ను నివారిస్తుంది.
గుడ్లు
గుడ్లు పోషకాల బాంఢాగారం. అందులోనూ ఇది సంపూర్ణ ఆహారం కూడా. గుడ్లను వండుడు చాలా సులువు. మొదటిసారి తల్లులు అయ్యే వారు గుడ్లను ఖచ్చితంగా తినాలని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్ల ద్వారా తగినంత ప్రోటీన్ ను పొందడమే కాదు లుటిన్, కోలిన్, విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలేట్, రిబోఫ్లేవిన్ కూడా అందుతాయి. ఇవి తల్లుల ఎముకలను బలోపేతం చేయడమే కాదు శిశువు ఎముక, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.
చేప
సాల్మన్, హెర్రింగ్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డిహెచ్ఎ, ఈపిఎ కు మంచి వనరులు. ఇవి మంటను తగ్గిస్తాయి. అలాగే రోగనిరోధక కణాలను సక్రియం చేస్తాయి. కొవ్వు చేపల్లో జింక్, సెలీనియం, విటమిన్ డిలు పుష్కలంగా ఉంటాయి.
గింజలు
జీడిపప్పు, వాల్ నట్స్, ఖర్జూరాలు, బాదం పప్పుల్లో సహజ చక్కెరలు, మొక్కల ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్ల కంటే ఇవి ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో పొటాషియం, ఫోలేట్, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ.. ప్రాసెస్ చేసిన చక్కెరలు, లవణాలు ఎక్కువగా ఉండే క్యాండీడ్ రకాలను అస్సలు తీసుకోకూడదు.
చిలగడదుంప
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ అని పిలిచే మొక్కల సమ్మేళనం పుష్కలంగా ఉంటాయి. దీనిని మన శరీరం విటమిన్ ఎ ను తయారుచేయడానికి ఉపయోగిస్తుంది. కాబోయే తల్లులకు విటమిన్ ఎ చాలా అవసరం. ఎందుకంటే ఇది కణ, కణజాలానికి ఉపయోగపడుతుంది. పిండం కణజాలం అభివృద్ధికి సహాయపడుతుంది. మీ శరీరంలో విటమిన్ ఉత్పత్తిని పెంచేందుకు చిలగడదుంపలను తినండి.
గ్రీన్ వెజిటేబుల్స్
బ్రోకోలి, ముదురు, ఆకుపచ్చకూరగాయలు, బచ్చలికూర, మెంతికూర వంటి కూరగాయలు చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, విటమిన్ కె, ఐరన్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. తల్లికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ వీటి ద్వారా లభిస్తుంది. పిల్లలను కనే వారికి ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. గింజలు, ఆకుకూరలు, బీన్స్, సిట్రస్ పండ్లు, తృణధాన్యాలల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, వెన్నుపాము వంటి పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీకు తెలుసా గర్భందాల్చిన మొదటి 28 రోజుల తర్వాత న్యూరల్ ట్యూబ్ లోపాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఫోలిక్ ఆమ్లం చాలా అవసరమవుతుంది.