పిల్లలు ఊరికే కొట్టుకుంటున్నారా.. పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!
చాలా మంది పిల్లలు కొట్టుకున్నప్పుడు. ఎవరినో ఒకరిని కొట్టడం, లేదంటే..ఇద్దరినీ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారు. దాని వల్ల.. పిల్లలకు ఒకరిపై మరొకరికి కోపం పెరిగిపోతోంది.
Siblings fight
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే.. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ల గొడవలు చూసి పేరెంట్స్ కూడా విసిగిపోతూ ఉంటారు. ఇద్దరికీ ఒకేలాంటి డ్రెస్, వస్తువులు తెచ్చి ఇచ్చినా కూడా ఎక్కడ గొడవ వస్తుందో తెలీదు కానీ.. కొట్టుకుంటూనే ఉంటారు. అసలు పిల్లల మద్య గొడవలు రాకుండా ఉండాలన్నా, వారు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియక మీరు కూడా సతమతమౌతున్నారా..? అయితే.. నిపుణులు చెబుతున్న ఈ ట్రిక్స్ మీరు కూడా ఫాలో అవ్వండి.
Siblings fight
చాలా మంది పిల్లలు కొట్టుకున్నప్పుడు. ఎవరినో ఒకరిని కొట్టడం, లేదంటే..ఇద్దరినీ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారు. దాని వల్ల.. పిల్లలకు ఒకరిపై మరొకరికి కోపం పెరిగిపోతోంది. నీ వల్లే అమ్మ నన్ను కొట్టింది.. నాన్న నన్ను తిట్టాడు అని కోపం పెంచుకుంటారు. వారి మధ్య సఖ్యత కూడా తగ్గిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే... ముందు మీరు పిల్లల సమస్య తీర్చే ప్రయత్నం చేయాలి.
Siblings fight
సరైన ప్రవర్తనను రూపొందించండి
పిల్లలు వినేదాని కంటే ఎక్కువగా చూసేదాన్ని ఫాలో అవుతారు. "మీరు సానుకూల సంభాషణ శైలులను ప్రదర్శించాలి - ఇది స్నేహితులతో లేదా మీ భాగస్వామితో కావచ్చు. పిల్లలను కలిగి ఉండటం వలన విభేదాలను సానుకూలంగా ఎలా పరిష్కరించుకోవాలో లేదా ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలుసుకోవడం గొప్ప రోల్ మోడల్‌గా ఉపయోగపడుతుంది" వారు మీరు ప్రవర్తించే తీరును పట్టే.. వారి తోడపుట్టిన వారితోకూడా ఫాలో అవుతారనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి.
Siblings fight
సమస్యను పరిష్కరించండి
"ఏమి జరుగుతుందో వారితో మాట్లాడండి. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడండి, ఆపై వారితో కలిసి మాట్లాడండి. ప్రతి ఒక్కరినీ మాట్లాడటానికి అనుమతించండి. వారి సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించి..అది వారికి నచ్చేలా వివరించాలి.
Siblings fight
స్పష్టమైన అంచనాలను సెట్ చేయండి
మీ పిల్లలకు ఎక్స్ పక్టేషన్స్ తెలియజేయండి. "తల్లిదండ్రుల అంచనాలు అస్పష్టంగా ఉన్న చోట, తోబుట్టువులు విషయాలను సరిదిద్దడానికి పోరాడటం ప్రారంభిస్తారు. కాబట్టి.. మీవైపు నుంచి వారికి తేడాలు రాకుండా చూడాలి. ఇంట్లో ఉన్న పిల్లలు అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. వారు ఎందులో ఎక్కు, తక్కువ ఉన్నా కూడా ఒకేలా చూడాలి.
Siblings fight
మీ పిల్లలు వారు తోడబుట్టిన వారితో ప్రేమగా ఉన్నా, ఒకరికి మరొకరు సహాయం చేసుకున్నట్లు మీకు అనిపిస్తే.. వెంటనే.. వారికి బహుమతులు లాంటివి ఇచ్చి.. మెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా వారు ఒకరితో మరొకరు గొడవలు పడకుండా ఉంటారు.