పిల్లలు చూస్తుండగా పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే..!
వారి జీవితం బాగుండాలంటే... పేరెంట్స్ కొన్ని చేయకుండా కూడా ఉండాలి. అర్థం కాలేదా..? నిజంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే.. పేరెంట్స్ పిల్లల ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మరి.. ఆ పనులేంటో ఓసారి చూద్దాం...
parents
తల్లిదండ్రులుగా మారిన క్షణం నుంచి ప్రతి పేరెంట్స్ తమ పిల్లల గురించే ఆలోచిస్తారు. వారికి ఎలాంటి కష్టం రాకూడదనే అనుకుంటారు. అడగకుండానే వారి అవసరాలు మొత్తం తీర్చాలని అనుకుంటారు. ప్రతి నిమిషం వారికోసమే తిపిస్తూ ఉంటారు. తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని వారు కష్టపడుతూ ఉంటారు. అహర్నిశలు శ్రమించి డబ్బు కూడపెడతారు. మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు. ఇలా ఒక్కటేంటి.. చాలానే చేస్తారు. అయితే.. పిల్లల కోసం ఇన్ని చేయడమే కాదు.. వారి జీవితం బాగుండాలంటే... పేరెంట్స్ కొన్ని చేయకుండా కూడా ఉండాలి. అర్థం కాలేదా..? నిజంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే.. పేరెంట్స్ పిల్లల ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మరి.. ఆ పనులేంటో ఓసారి చూద్దాం...
Sadhguru Suggest Parents
భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తుల్లో సద్గురు కూడా ఒకరు. ఆయన తరచూ..పలు విషయాలను బోధిస్తూ ఉంటారు. ఆరోగ్యం, ఆహారం గురించి మాత్రమే కాకుండా.. పేరెంటింగ్ గురించి కూడా చెబుతూ ఉంటారు. ఆయన సలహా ప్రకారం.. పేరెంట్స్ పిల్లల ముందు ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుందాం..
parents
సద్గురు ప్రకారం, పిల్లలను ఇలాగే పెంచాలనే నియమం ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గంలో పిల్లలను పెంచుతారు. ఐదు నుంచి పది మంది పిల్లలను పెంచిన తల్లిదండ్రులకు కూడా పిల్లలను సరిగ్గా ఎలా పెంచాలో తెలియడం లేదు.
parents
పిల్లలను ఎలా పెంచాలో ఆలోచించే ముందు తల్లిదండ్రులు మనం ఎలా ఉన్నారో చూడాలి అని సద్గురు చెప్పారు. ప్రతి వ్యక్తి పిల్లల ముందు ఏమి చేస్తారో గుర్తుంచుకోవాలి. పిల్లలు కూర్చోవడం నుండి పడుకునే వరకు వారి ముందు ఎలా ఉండాలో తల్లిదండ్రులు మొదట నేర్చుకోవాలని సద్గురు చెప్పారు. తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు చాలా త్వరగా నేర్చుకుంటారు.
డిప్రెషన్‌లో ఉండకండి: పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారు కంటికి కనిపించేది పరమ సత్యమని నమ్ముతారు. పిల్లలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం. మీరు ఏ విషయమైనా బాధపడినా, బాధించినా పిల్లల ముందు మీ బాధను, కోపాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల నిరాశ, నిస్పృహలు పిల్లలపై ప్రభావం చూపుతాయి. ఇది వారిని ప్రతికూలంగా చేస్తుంది.
తల్లితండ్రులు అన్ని దుఃఖాలను మింగుకుని పిల్లల ముందు సంతోషంగా ఉండాలి. ప్రేమతో ప్రవర్తించండి. తల్లితండ్రుల ముఖంలో చిరునవ్వు ఉంటే, వారు ఏదైనా ఆనందంతో స్వీకరిస్తే, అది పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుంది.
పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండమని సద్గురు చెప్పారు: పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో దానిపై శ్రద్ధ పెట్టాలి. పిల్లలను ప్రోత్సహించడం లేదా సలహా ఇవ్వడం వంటివి వారికి మంచి ఉదాహరణగా ఉండండి. మీ పిల్లల ముందు మీకు నచ్చని లేదా వినడానికి ఇష్టపడని పదాలు, విషయాలు ఏవీ చెప్పకండి. పిల్లలకు చెడ్డ ఉదాహరణ ఇవ్వవద్దని సద్గురు తన బోధనలో చెప్పారు.
గొడవలు వద్దు: భార్యాభర్తలైనా, కుటుంబ సభ్యులైనా పిల్లల ముందు గొడవ పడకండి. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ విషయాల్లో మనం కరెక్ట్ గా ఉంటే... పిల్లల భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.