MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో ఈ దేశమే టాప్.. అక్కడి పేరెంట్స్ ఏం చేస్తారో తెలుసా?

Parenting Tips: పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో ఈ దేశమే టాప్.. అక్కడి పేరెంట్స్ ఏం చేస్తారో తెలుసా?

పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ వారికి ఎలాంటి లోటులేకుండా చూసుకోవాలని అనుకుంటారు. కానీ పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో ఏ దేశం టాప్ లో ఉందో మీకు తెలుసా? అక్కడ పేరెంట్స్ ఏం చేస్తారో చూద్దాం.

Kavitha G | Published : Mar 03 2025, 12:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

UNICEF ప్రకారం, ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పిల్లల మానసిక సంతోషం, శారీరక ఆరోగ్యం, చదువు ఇంకా సామాజిక నైపుణ్యాల అభివృద్ధి ఆధారంగా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. గతేడాది యూనిసెఫ్ 41 ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల స్థాయిని పరిశీలించగా, 'నెదర్లాండ్స్' లోని పిల్లలు ప్రపంచంలోనే సంతోషంగా ఉన్నారని కనుగొన్నారు.

ఈ దేశంలోని ప్రజలు పేరెంటింగ్ చిట్కాలకు పేరుగాంచారు. నిజానికి, ఇక్కడి పిల్లలు ప్రపంచంలోనే సంతోషకరమైన పిల్లలుగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ దేశం గురించి, ఇక్కడి పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానం గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి.

25
ఈ దేశంలో పిల్లలు స్వేచ్ఛగా..

ఈ దేశంలో పిల్లలు స్వేచ్ఛగా..

నిజానికి, ఈ దేశంలోని పేరెంట్స్ పరస్పర సహకారం, సామాజిక అభ్యాసం ఇంకా వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలు చదువులో రాణించాలని ఒత్తిడి చేయరు. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలకు నచ్చిన పనులు చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. 

పిల్లల్ని శారీరక శ్రమ, సంగీతం, ఆటలు ఇంకా ఇతర విషయాలు చేయడానికి ప్రోత్సహిస్తారు. అందుకే నెదర్లాండ్స్ లోని పిల్లలు మానసికంగా బాగా ఉంటారు. ఇంకా వాళ్ళు సృజనాత్మకంగా, తెలివిగా ఎదుగుతారు.

35
పిల్లల్ని పెంచే విధానం:

పిల్లల్ని పెంచే విధానం:

ఇక్కడ పేరెంట్స్ తమ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కింద పడితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోరు. ఒకవేళ గాయమైతే దాని గురించి ఎక్కువగా బాధపడరు. కింద పడినా వాళ్ళంతట వాళ్ళు లేచి మళ్ళీ ఆడుకుంటారు. 

ఒక సర్వేలో నెదర్లాండ్స్ లో దాదాపు సగం మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా తండ్రులు ప్రతీ వారం కనీసం ఒక్క రోజైనా సెలవు తీసుకొని తమ పిల్లలతో బంధం ఏర్పరచుకోవడానికి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తారట.

45
పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం

పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం

నెదర్లాండ్స్ పేరెంట్స్ తమ పిల్లలతో కలిసి కనీసం ఒకసారైనా భోజనం చేస్తారు. ముఖ్యంగా రాత్రిపూట కుటుంబంతో కలిసి తింటారు. ఈ టైంలో వాళ్ళ రోజు గురించి మాట్లాడుకుని సంతోషిస్తారు. ఇలా పేరెంట్స్ తో కలిసి ఉండటం వల్ల పిల్లలు సంతోషంగా, భావోద్వేగంగా ఉంటారు.

నెదర్లాండ్స్ పేరెంట్స్ తమ నిర్ణయాలను పిల్లలపై రుద్దరు. కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు జరుపుతున్నప్పుడు పిల్లల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

55
తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు?

తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు?

నెదర్లాండ్స్ లోని పేరెంట్స్ తమ పిల్లల్ని మంచిగా పెంచడం, బాధ్యతాయుతంగా మార్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇంకా వాళ్ళు తమ పిల్లలకు సపోర్టివ్ గా ఉంటారు. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జీవనశైలి
 
Recommended Stories
Top Stories