పిల్లల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..? వెంటనే ఆపేయండి...!
చాలా మంది తల్లిదండ్రులకు వారు చేసే పొరపాటు ఏంటో కూడా తెలీదు. కానీ.. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే....మనం పిల్లలకు చిన్నతనంలో నేర్పించిన చాలా విషయాలే... వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు. పిల్లలపై ప్రేమ చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ.... ఆ ప్రేమ చూపించే క్రమంలో పొరపాట్లు మాత్రం చేయకూడదు. మనం ప్రేమ అనుకొని పొరపడి చేసే కొన్ని పొరపాట్లు... వారి భవిష్యత్తును నాశనం చేసేస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం...
చాలా మంది తల్లిదండ్రులకు వారు చేసే పొరపాటు ఏంటో కూడా తెలీదు. కానీ.. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే....మనం పిల్లలకు చిన్నతనంలో నేర్పించిన చాలా విషయాలే... వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. వారిలో కాన్ఫిడెన్స్ నింపుతాయి. మరి చేయకూడనివి ఏంటో చూద్దాం..
1.చాలా మంది తమ పిల్లలపై విపరీతమైన ప్రేమ చూపిస్తారు. చాలా ప్యాంపర్ చేస్తారు. ఎంతలా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పిల్లలు మా ఇష్టం అని చెబుతూ ఉంటారు. కానీ... అలా విపరీతంగా ప్యాంపర్ చేయడం వల్ల వారు పెద్దవారు అయ్యాక కూడా.. అందరూ తమను ప్యాంపర్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. అలా చేయకపోతే డిప్రెషన్ కి గురౌతూ ఉంటారు.
2.చాలా మంది పిల్లల చదువు, కెరీర్ విషయంలో వారి డిసెషన్ వారిని తీసుకోనివ్వరు. అన్నీ తాము చెప్పినట్లే చేయాలని భావిస్తూ ఉంటారు. దీని వల్ల.. వారు పెద్దయ్యాక కూడా ఏ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోలేరు. జీవితంలో అసలు రిస్క్ చేయలేరు.
3.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందే గొడవలు పడుతూ ఉంటారు. ఒక్కసారి అంటే అనుకోవచ్చు. తరచూ అదేపని చేస్తారు. దీని వల్ల... అది పిల్లల భవిష్యత్తుపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. పెద్దయ్యాక వారికి కూడా... తమ పార్ట్ నర్ విషయంలో నమ్మకం ఉండదు. చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
4.ఇక... కొందరు తల్లిదండ్రులు వీలు కాని డిమాండ్స్ చేస్తూ ఉంటారు తమ పిల్లలకు. అంటే.. చదువుల్లో 100 కి వంద మార్కులు రావాలి.. అన్నిట్లోనూ నువ్వే ఫస్ట్ రావాలి లాంటి ఒత్తిడి పెడుతూ ఉంటారు. పిల్లలు ఎంత సాధించినా... తృప్తి పడని తల్లిదండ్రులు ఉంటారు. అలా ఉండకూడదు.
5.పిల్లలను స్వతంత్రంగా బతకనివ్వాలి. ప్రేమతో అన్ని పనులను ఎదురు చేయడం లాంటివి చేయకూడదు. పెద్దయ్యాక వారు డిపెండెంట్ గా మారిపోతారు. ప్రతి విషయంలోనూ అయోమయానికి గురౌతారు. ఇతరులు కూడా వారిని సులభంగా మనిప్యూలేట్ చేసే ప్రమాదం ఉంది.
parent's day
6.కొందరు పిల్లలపై అతి ప్రేమ చూపిస్తే... మరి కొందరు అసలు అటెన్షన్ చూపించారు. వారికి కావాల్సిన తండి, దుస్తులు ఇచ్చామా లేదా అనేదే చూస్తారు. వారితో కలిసి కాసేపు ఆడుకోవడం, వారికి కథలు చెప్పడం లాంటివి అస్సలు చేయరు. దీని వల్ల అలాంటి పిల్లలు పెద్దయ్యాక నారో మైండెడ్ గా ఆలోచిస్తారు.
7.ఇక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఫీలింగ్స్ ని కూడా చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు. పెద్దగా వారి ఫీలింగ్స్ ని లెక్కలోకి తీసుకోరు. దీని వల్ల వారు.. ఎప్పుడో ఒకసారి ఎవరిమీదో ఒకరి మీద బరస్ట్ అయ్యే అవకాశం ఉంది.
8. కొందరు తమ పిల్లలపై ప్రేమను చూపించరు. ప్రేమను చూపిస్తే... గారాభం చేసినట్లు అవుతుందని వారు భావిస్తూ ఉంటారు. అందుకే ప్రేమ చూపించరు. కానీ... తల్లిదండ్రుల ప్రేమ దొరకని పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వారి శరీరంపై వారి సామర్థ్యాలపై కూడా వారికి ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉంటాయి.