MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: పిల్లలు మాట వినడం లేదా?

Parenting Tips: పిల్లలు మాట వినడం లేదా?

Parenting Tips: తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగా పిల్లలు సోమరిపోతుల్లా తయారౌతున్నారు. మరి, పేరెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందామా..

2 Min read
Author : ramya Sridhar
| Updated : Mar 05 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. తమ పిల్లలు కష్టపడకూడదని, వారి కోసం అన్నీ సమకూరుస్తారు. కానీ.. చాలా మంది పేరెంట్స్ తెలిసో, తెలియక చేసే కొన్ని పనులు కారణంగా పిల్లలు సోమరిపోతుల్లా తయారౌతున్నారని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.

తల్లిదండ్రులు చేసే కొన్ని పనుల కారణంగానే పిల్లలు మొండిగా తయారై.. చివరకు ఆ పేరెంట్స్ మాటే వినకుండా పోతున్నారు. జీవితంలో బాధ్యత అనేది లేకుండా తయారౌతున్నారు. మరి.. పిల్లలు అలా కాకుండా.. మంచిగా జీవితంలో పైకి ఎదగాలంటే.. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
తప్పును కనుక్కోవడం

తప్పును కనుక్కోవడం

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా పని అప్పగిస్తే, ఆ పిల్లవాడు దాన్ని పూర్తి చేసిన తర్వాత, తల్లిదండ్రులు పనిని మెచ్చుకోవాలి. కానీ.. చాలా మంది వారు చేసిన పనిని మెచ్చుకోకుండా.. చేసిన దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో తప్పులు వెతకడం వల్ల  పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా వారు మీరు ఇచ్చే పనిని చేయడానికి తప్పించుకుంటారు. పని చెప్పగానే చేయకుండా జారుకుంటారు. అదే అలవాటుగా చేసుకొని.. మాట వినకుండా తయారౌతారు.

 

34
పిల్లలపై నమ్మకం లేకపోవడం

పిల్లలపై నమ్మకం లేకపోవడం

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్తిగా నమ్మాలి. కానీ పిల్లలను నమ్మని తల్లిదండ్రుల పిల్లలు క్రమంగా తమ బాధ్యతలను తప్పించుకోవడం మొదలుపెడతారు. ఇది కాకుండా కొన్ని విషయాలకు తమ పిల్లలను కొట్టే అలవాటు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఎక్కువగా తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇంకా వారు తల్లిదండ్రులు చెప్పేది ఎప్పుడూ గౌరవించరు. కాలక్రమేణా సోమరిపోతులుగా మారుతారు.

 

44
అతిగా విచారణ చేయడం

అతిగా విచారణ చేయడం

మీరు మీ పిల్లల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటే, వారికి మీపై ఉన్న నమ్మకం తగ్గుతుంది. దీని కారణంగా మీరు ఇచ్చే ఏ పనినైనా చేయడానికి వారు తప్పించుకుంటారు. ఇంకా వారి ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా మీ నుంచి వారు దూరంగా జరగడం మొదలుపెడతారు. దీని కారణంగా పిల్లలు సోమరిపోతులుగా మారిపోతారు.

గమనిక: తల్లిదండ్రులు తమ పిల్లల మాటలను, భావాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా మీలో ఉన్న ఈ అలవాట్లను మార్చుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved