పిల్లలకు క్రమశిక్షణ నేర్పే ముందు తల్లిదండ్రులు ఈ పనులు ఖచ్చితంగా చేయాలి
పిల్లలకు క్రమశిక్షణ అంత సులువైన విషయమేమీ కాదు. అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ ఈ పని కంటె ముందు ప్రతి పేరెంట్స్ కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే?
పిల్లల పెంపకం అంత సులువేం కాదు. పిల్లలు కల్మషం లేని వారు. వీరి ప్రవర్థన తరచుగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు కొంటె పనులుచేయం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచే వారిని క్రమశిక్షణలో ఉంచాలనుకుంటారు. దీనిలో తప్పేం లేదు. కానీ పిల్లలకు క్రమశిక్షణను నేర్పడానికి ముందుగా తల్లిదండ్రులు తమలో క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలి. నేర్చుకోవడం కష్టమైతే ఇతరులను చూసి కాపీ చేయండి. తల్లిదండ్రులు చేసే పనును పిల్లలు కూడా చేస్తారు. అందుకే క్రమశిక్షణను బోధించే ముందు తల్లిదండ్రులు ఈ పనులను ఖచ్చితంగా చేయాలి.
పిల్లలు తప్పు చేసినప్పుడు..
పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమించమని లేదా తప్పు ఒప్పుకుంటారు. కానీ తల్లిదండ్రులు తప్పు చేస్తే మాత్రం మౌనంగా ఉంటారు. దానిగురించి అస్సలు మాట్లాడరు. కానీ ఇది మంచి అలవాటు కాదు. తల్లిదండ్రుల నుంచి తప్పు జరిగితే వెంటనే మీ పిల్లల ముందు తప్పును అంగీకరించండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు వాళ్లు చేసిన తప్పులకు బాధ్యత తీసుకోవాలనే భావన కలుగుతుంది.
తప్పుడు వాగ్దానాలు చేయొద్దు
తప్పుడు వాగ్దానాలు, మాటలు చెప్పి పిల్లల్ని భయపెట్టే అలవాటు చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే నీకోసం అది చేస్తాం ఇది చేస్తాం అని సాకులు చెప్తుంటారు. కానీ దానిని చేసే సమయంలో ఎన్నో సాకులు చెప్తారు. లేదా పిల్లలు చేసిన తప్పుపై ఏదో ఒకటి చెప్పి భయపెడుతుంటారు. ఈ అలవాటును ప్రతితల్లిదండ్రులు వెంటనే మానుకోవాలి. ఇది మీ పిల్లలకు మీరు అబద్దాలను చెప్పడం నేర్పినట్టు అవుతుంది. ఏదేమైనా మీ మాటలకు కట్టుబడి ఉండండి. మీరు మీ పిల్లలకు ఏదైనా ప్రామిస్ చేసినట్టైతే దానిని నెరవేర్చండి. అలాగే ప్రతిదానికీ భయపెట్టకండి.
ఇతర పిల్లలతో పోల్చొద్దు
పిల్లలను వేరే పిల్లలతో, క్లాస్ లోని ఇతర విద్యార్థులతో పోల్చకూడదన్న మాటను చాలా వినే ఉంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చడం మాత్రం మానుకోరు. కానీ ఈ అలవాటు వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ దీనివల్ల పిల్లల మనస్సులో వేరేపిల్లల తల్లిదండ్రులు మంచివారు అనే ఇమేజ్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. దీనివల్ల పిల్లలు మిమ్మల్ని ఇతరుల తల్లిదండ్రులతో పోల్చడం ప్రారంభిస్తారు. కాబట్టి మీ పిల్లలను వేరే పిల్లలతో పోల్చకండి.