పిల్లలకు తల్లిదండ్రులు ఉదయాన్నే ఏం చెప్పాలో తెలుసా?
ఉదయం లేవగానే ప్రతి తల్లిదండ్రుల తమ పిల్లలకు కొన్ని విషయాలను ఖచ్చితంగా చెప్పాలి. ఇవి మీ పిల్లల ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే వారిని ఆనందంగా ఉంచేలా చేస్తాయి. అవేంటంటే?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వృద్ధులే కాదు, చిన్న పిల్లలు కూడా ఎన్నో విషయాల గురించి టెన్షన్ పడుతుంటారు. క్లాస్ ఫస్ట్ రేసు నుంచి గేమ్స్, కళారంగంలో పెరుగుతున్న పోటీ వరకు ప్రతిరోజూ ఒక పోరాటం లాగే గడిచిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉదయం లేవగానే తల్లిదండ్రుల పిల్లలకు కొన్ని విషయాలను చెప్తే వారికి ఈ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వారిని ఆనందంగా ఉంచుతాయి.
నిజానికి ఉదయం సమయం మీ బిడ్డకు చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో పిల్లల మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో వారికి ఏది చెప్పినా అది వారి మనస్సులో చాలా కాలం పాటు నిలిచిపోతుంది. కానీ ఈ హడావిడి లైఫ్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి , వారిని సంతోషంగా ఉంచడానికి ఉదయం ఏ విషయాలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాళ్లంటే ఎంత ఇష్టమో చెప్పండి
మీ పిల్లలు పొద్దున్న లేచిన వెంటనే వాళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దులు పెట్టుకొని హగ్ చేసుకోండి. వాళ్లంటే ఎంత ఇష్టమో మీ పిల్లలక చెప్పండి. మీ నోటి నుంచి ఈ మాట వినడం వల్ల మీ పిల్లలకు ఒక నమ్మకం ఉంటుంది. అలాగే వారు సేఫ్ గా ఉన్నట్టుగా భావిస్తారు. దీనివల్ల మీ పిల్లలు రోజంతా బాగుంటారు. అలాగే కొత్త విషయాలను కూడా బాగా నేర్చుకుంటారు.
పిల్లలతో సానుకూలంగా మాట్లాడండి
ఉదయం మీ పిల్లలు లేచిన వెంటనే వాళ్లు ఎంత మంచివారో చెప్పండి. వాళ్లు ఏమేం సాధిస్తారనేది కూడా చెప్పండి. ఇవి కేవలం పొగడ్తలే అయినా మీ పిల్లలు తెగ ఆనంద పడతారు. ఈ చిన్న పొగడ్త మీ పిల్లల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే వారి ప్రవర్తనను మెరుగుపరుస్తుంది.
ఈ రోజు ఏం చేస్తారు
ఉదయం నిద్రలేచిన వెంటనే మీ పిల్లలు రోజంతా ఏం చేస్తారో అడగండి. ఇలా అడగడం వల్ల వారి మెదడు నిర్మాణం మెరుగ్గా మారడంతో పాటు రోజు ప్లానింగ్ ను పూర్తి చేయడంలో నిమగ్నమవుతారు. ఆ పనుల్లోనే బిజీగా ఉంటారు.