కడుపుతో ఉన్నప్పుడు మామిడి పండ్లు తినొచ్చా..?
ఒక చిన్న కప్పు మామిడి ముక్కలు రోజూ తినడం వల్ల.. మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ అందుతుంది.
ఎండాకాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. తాజా మామిడి పండ్లు చూస్తుంటే ఎవరికైనా నోరూరుపోతుంది. ఇక గర్భిణీలకు సైతం మామిడి పండు తినేలనే కోరిక కలగడం చాలా సహజం, అయితే.. కడుపుతో ఉన్నప్పుడు మామిడి తినకూడదని.. వేడి చేస్తుందని.. బిడ్డకు సమస్య కలుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇందులో నిజం ఎంత..? నిజంగానే గర్భిణీ స్త్రీలు మామిడి తినకూడదా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
mango
మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక చిన్న కప్పు మామిడి ముక్కలు రోజూ తినడం వల్ల.. మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ అందుతుంది. ఇక విటమిన్ సి టిష్యూ రిపేర్ కీ, రోగనిరోధక శక్తి పెంచడానికి, కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడానికి సహాయపడతాయి.
అంతేకాదు.. మామిడి పండులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే.. ఈ పండు తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ రోగనిరోధక శక్తి కోసం.. ఏవైనా ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక.. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స, న్యూటీయంట్స, ఎనర్జీని అందిస్తాయి. అందుకే.. గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండు తినొచ్చు.
అయితే... తినమన్నారు కదా అని ఎక్కువ మొత్తంలో మాత్రం తినకూడదు. రోజుకి అర మామిడి పండు తినొచ్చు. ఒక ఫుల్ పండు కూడా తినకపోవడమే మంచిది. మరీ ఎక్కువగా తినడం వల్ల.. మీరు నిర్జలీకరణం , విరేచనాలను ఎదుర్కోవలసి ఉంటుంది, గర్భధారణ మధుమేహం, అధిక బరువు పెరగడం, అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఆల్రెడీ మధుమేహం.. అధిక బరువు ఉన్నవారు.. మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది.యమామిడి అనేది పోషకాలతో నిండిన పండు, ఇది శిశువు ఆరోగ్యకరమైన అభివృద్ధిని నిర్ధారిస్తుంది. తల్లికీ, బిడ్డకు మేలు చేస్తుంది. అయితే.. అతిగా తినకుండా.. మితంగా తింటే... ఈ పండు.. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై అద్భుతాలు చేస్తుంది.