పిల్లలను పెంచడం కష్టంగా అనిపిస్తోందా..? ఈ ఐదు ఫాలో అయితే చాలు
ఈ కాలం పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. పేరెంట్స్ గారాబం కారణంగా వారిలో మొండితనం చాలా ఎక్కువ అవుతోంది.

parenting tips
ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా కనీసం ఐదారుగురు పిల్లలు ఉండేవారు. అంత మంది పిల్లలు ఉన్నా.. పేరెంట్స్ కి వాళ్లని పెంచడం అంత ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇంట్లో ఒక్క పిల్లవాడు ఉన్నా.. వారిని పెంచడం పేరెంట్స్ కి తలనొప్పిగా మారుతోంది. ఇక.. ఇద్దరు ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ పిల్లలను, ఇటు వర్క్ మేనేజ్ చేసుకోలేక చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే...పిల్లలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీ పేరింటింగ్ కూడా సాఫీగా సాగుతుంది. మరి, అవేంటో చూద్దామా....
ఈ కాలం పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. పేరెంట్స్ గారాబం కారణంగా వారిలో మొండితనం చాలా ఎక్కువ అవుతోంది. కావాల్సిన దానిని సాధించే వరకు వదలడం లేదు. ఎంతసేపు ఏడ్చి అయినా.. తమకు కావాల్సిన దానిని సాధించుకోవాలని చూస్తున్నారు. పిల్లలు ఏడ్వడం మొదలుపెట్టగానే పేరెంట్స్ వారిని సముదాయించడానికి వెంటనే వారు అడిగినవి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పిల్లల విషయంలో పేరెంట్స్ కొన్ని శ్రద్ధలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
1.పిల్లలను అర్థం చేసుకోండి....
పిల్లలు చాలా మొండిగా ఉంటున్నారు. ఎంత సముదాయించాలి అని చూసినా పిల్లలు విడనం లేదు అని పేరెంట్స్ చెబుతున్నారు. పిల్లలు మాట వినడం లేదు అని పేరెంట్స్ కోపగించుకోవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు.. అవి చేస్తే పిల్లలు మరింత మొండిగా మారే అవకాశం ఉంది. అందుకే.. వారి మీద కోప్పడటం కాకుండా.. వారికి ఏం కావాలి? ఎందుకు కావాలి? సమస్య ఏంటి అనే విషయాన్ని నెమ్మదిగా అడగడానికి ప్రయత్నించాలి. పిల్లలు స్కూల్ కి వెళ్లను అని ఏడుస్తుంటే.. కోప్పడకుండా.. ఒకే వెళ్లొద్దు.. అని మొదట ఒకే చెప్పి.. తర్వాత వెళ్లపోతే ఏమౌతుంది లాంటి విషయాన్ని కూల్ గా చెప్పాలి.. అప్పుడు పిల్లల వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
2. సరైన సరిహద్దులను నిర్ణయించండి
తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టమైన హద్దులను చూపించడం చాలా ముఖ్యం. ఏ పని చేస్తే మంచి ఫలితం వస్తుందో, తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో ముందుగానే వారికి తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ అంచనాలను బహిరంగంగా చెబితే, పిల్లలు వాటిని అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయాన్ని క్లియర్ గా పిల్లలను చెబుతూనే ఉండాలి.
3. పిల్లలతో కలిసి సమయం గడపండి
తల్లిదండ్రులు పిల్లలకు కేవలం పెద్దవారిగానే కాకుండా, స్నేహితుల్లా ఉండాలి. పిల్లలతో కలిసి హోంవర్క్ చేయడం, కథలు చదవడం, చిత్రాలు గీయడం లేదా ఆటలు ఆడడం వంటివి వారితో బంధాన్ని బలపరుస్తాయి. పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడిపినప్పుడు, ప్రేమ, గౌరవం, భద్రత అనుభవిస్తారు. ఇలాగే వారిని అర్థం చేసుకోవడం కూడా తేలిక అవుతుంది.
4. క్రమశిక్షణ అంటే శిక్ష కాదు
పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడానికి శిక్షించకూడదు. పదే పదే శిక్షిస్తే, వారు మరింత మొండిగా, కోపంగా మారే ప్రమాదం ఉంది. శిక్షకు బదులు, తల్లిదండ్రులు సహనంతో, సానుకూల మార్గాల్లో క్రమశిక్షణను నేర్పాలి. ఉదాహరణలు చెప్పడం ద్వారా వారికి వివరించే అవకాశం ఉంది.
5. వారి విజయాలను గుర్తించండి
పిల్లలు చేసిన పనిని ప్రశంసించడం చాలా గొప్ప విషయం. చిన్న విజయమైనా, పెద్ద విజయమైనా అది వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. హోంవర్క్ పూర్తి చేయడం, పాఠశాలకు సిద్ధమవడం, కొత్త పనిని నేర్చుకోవడం – ఇవన్నీ ప్రశంసించదగినవే. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచి, మరింత బాధ్యతగా ప్రవర్తించేలా చేస్తుంది.