parenting: తండ్రి మాత్రమే కొడుకుకు నేర్పించే ముఖ్య విషయాలు ఇవిగో
parenting: పిల్లలు ఎక్కువ తల్లితోనే చనువుగా ఉంటారు. అందువల్ల ఎక్కువ విషయాలు తల్లి నుంచే నేర్చుకుంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా తండ్రే నేర్పించాలి. అలాంటి ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సాధారణంగా ప్రతి కుటుంబంలో తండ్రి సంపాదించడానికి బయటకు వెళ్తారు. తల్లి ఇంట్లో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతుంటారు. అందుకే పిల్లలు ఎక్కువ తల్లితో ప్రేమగా, చాలా చనువుగా ఉంటారు. అందుకే తల్లి నేర్పించే కొన్ని విషయాలను గాని, పద్ధతులను గాని పిల్లలు బుర్రలో పెట్టుకోరు. లైట్ తీసుకుంటారు. అందువల్ల కొన్ని విషయాలను తండ్రే పిల్లలకి నేర్పించాలి. ఇవి తెలుసుకుంటే పిల్లలు సమాజంలో సక్రమమైన విధానంలో బతకడం నేర్చుకుంటారు. ఆ ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోవడం..
సాధారణంగా పిల్లలు ఎక్కువ కోప్పడం, భయపడడం, ఏడవడం చేస్తుంటారు. అయితే వీటిని ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎలా వ్యక్తపరచాలో పిల్లలకి తండ్రే నేర్పించాలి. ఏ విధంగా కోపాన్ని ప్రదర్శించాలి? ఎలాంటి విషయాలకి కన్నీరు పెట్టుకోవాలి? వేటిని చూసి భయపడాలి? ఇలాంటి విషయాలన్నీ తండ్రే నేర్పించాలి.
బాధ్యతగా వ్యవహరించడం..
పిల్లలకి తన తండ్రి ఒక సూపర్ హీరో. ఆయన ఏం చేసినా పిల్లలు వాటిని ఫాలో అవుతారు. అందుకే పిల్లలకు బాధ్యతగా ఎలా వ్యవహరించాలో తండ్రే నేర్పించాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి. తన భార్యను, అమ్మను తాను ఎలా గౌరవంగా చూస్తారో వివరిస్తూ అలాగే ఉండాలని చెప్పాలి.
చిన్న చిన్న పనులు పిల్లలకు అప్పగించి వాటిని ఎలా విజయవంతంగా చేయాలో నేర్పించాలి. తప్పు చేస్తే ఎలా సరిదిద్దాలో వివరించాలి.
ఫెయిల్యూర్స్ ని ఎలా తట్టుకోవాలి..
ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ చాలా కామన్ విషయం. కానీ పిల్లలు ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేరు. వారు అనుకున్నది జరగకపోతే చాలా బాధపడతారు. ఒక్కోసారి ఫెయిల్యూర్ తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందువల్ల ఫెయిల్యూర్ ని ఎలా తట్టుకోవాలో తండ్రి పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే అప్పటికే తండ్రి ఎన్నో ఫెయిల్యూర్స్ ని దాటి సక్సెస్ ఫుల్ గా కుటుంబాన్ని నడిపిస్తుంటారు. తన ఎక్స్పీరియన్స్ లో జరిగిన సంఘటనలు ఉదహరిస్తూ ఫెయిల్యూర్ ఎలా తట్టుకోవాలో పిల్లలకు తండ్రే వివరించాలి.
మనీ మేనేజ్మెంట్..
కనిపించిన ప్రతిదీ కొనమని పిల్లలు అడగడం సహజం. వారికి ఏ వస్తువుకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు. కాబట్టి ఏదైనా కొనమని అడుగుతారు. అలాంటి సమయంలో పిల్లల్ని కసురుకుని, భయపెట్టి వస్తువు కొనకుండా ఉండడం కంటే.. డబ్బు విలువ తెలిసే విషయాల్ని వారికి తండ్రే నేర్పించాలి. పాకెట్ మనీ ఇస్తూ సేవ్ చేసుకోమని చెప్పి, వాటి ద్వారా తనకిష్టమైన వస్తువులు కొనుక్కునేలా తండ్రి ప్రోత్సహించాలి. డబ్బు పొదుపు చేయడం, కష్టపడి సంపాదించడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఇలాంటి విషయాలని తండ్రే కొడుకుకి నేర్పించాలి.
ఇది కూడా చదవండి భార్యాభర్తల మధ్య బంధాల్ని నాశనం చేసే 5 ముఖ్య కారణాలివే