- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting TIps: పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Parenting TIps: పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సోషల్ మీడియా రీల్స్‌కు బానిసలవుతున్న పిల్లల్ని ఎలా రక్షించాలి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు, ఆరోగ్యకరమైన మార్గాలు.

టెక్నాలజీ మంచిదే కానీ
డిజిటల్ యుగంలో మన జీవితాల్లో టెక్నాలజీ ఓ భాగంగా మారింది. ఇంట్లో నుంచే ప్రపంచాన్ని చూడగలిగే శక్తిని అందించిన ఈ పరిజ్ఞానం అనేక ఉపయోగాలు కలిగించినప్పటికీ, దాని చెడు వైపుల్ని కూడా మనం మరచిపోవద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలు సోషల్ మీడియా రీల్స్‌కు బానిసలవుతూ, వారి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సందర్భాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
చిన్న వయస్సులోనే రీల్స్‌పై ఆకర్షణ
చిన్న వయస్సులోనే రీల్స్‌పై ఆకర్షణ 10 ఏళ్లలోపు పిల్లలే రీల్స్‌కు బానిసలవుతున్నారు. తల్లిదండ్రుల నుంచి శ్రద్ధ లేకపోతే, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం అలవాటు పెరుగుతోంది.
ఫోన్లపై ఎక్కువ సమయం – ఆరోగ్యానికి హానికరం
ఊబకాయం, కళ్ళ తిప్పలు, మెదడు శక్తి తగ్గుదల, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అసభ్య కంటెంట్‌కు గురికావడం
రీల్స్ బానిసత్వానికి కారణాలు
తల్లిదండ్రుల బిజీ జీవితం, స్నేహితుల ప్రభావం, రోల్ మోడల్స్‌ను అనుసరించాలన్న కోరిక, సోషల్ మీడియాలో పాపులారిటీ కావాలన్న తాపత్రయం
తల్లిదండ్రులు తీసుకోవలసిన చర్యలు
ఫోన్ వినియోగాన్ని తగించే ప్రయత్నం , పిల్లలతో ప్రత్యక్షంగా గడిపే సమయం పెంచడం , కథలు చెప్పడం, బోర్డు గేమ్స్, ప్రకృతి విహారం ఆన్‌లైన్ కాకుండా ఆఫ్లైన్ ప్రతిభను ప్రోత్సహించడం
ప్రతిభను గుర్తించండి – ప్రోత్సహించండి
పెయింటింగ్, సంగీత సాధన , యోగా, స్కేటింగ్ , క్రీడలు , తోటపని , ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
స్క్రీన్ టైమ్‌ను కంట్రోల్ చేయండి
రోజూ క్రమంగా స్క్రీన్ టైమ్ తగ్గించండి, ఫోన్ సెట్టింగ్స్‌తో పరిమితి విధించండి, అవసరమైతే పాస్‌వర్డ్ వేయండి.
నిజమైన డిటాక్స్
నిజమైన డిటాక్స్ – మాటలతో, మమకారంతో మాట్లాడండి. . వాళ్లను వినండి . వారి స్నేహితులుగా ఉండండి . కలిసి నవ్వండి, ఆటలాడండి
పిల్లల భవిష్యత్తు
పిల్లల భవిష్యత్తు – మన చర్యలపై ఆధారపడినదే పిల్లల మెదడు ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలంటే — ఇప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలే కీలకం. సోషల్ మీడియా మన శత్రువు కాదు... కానీ దాన్ని జాగ్రత్తగా, అర్ధంతో వినియోగించాలి.