MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తారా? అయితే ఇలా చేయండి

మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తారా? అయితే ఇలా చేయండి

కొంతమంది పిల్లలు గొడవపడ్డా, హోం వర్క్ అవ్వట్లేదని, టీచర్ కు భయపడి కొట్టినా, తిట్టినా పెద్దగా పట్టించుకోరు. ఎక్కువగా ఏడవరు కూడా. కానీ కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తుంటారు. ఇది తల్లిదండ్రులకు విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి పిల్లల్ని ఎలా స్ట్రాంగ్ చేయాలో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 11 2024, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Crying baby

Crying baby

చాలా మటుకు పిల్లల్ని తల్లిదండ్రులు తెగ గారాబం పెట్టేస్తుంటారు. కానీ అతి గారాబం పిల్లలకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది పిల్లల్ని మొండిగా, మరింత సున్నితంగా చేస్తుంది. అయితే కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తుంటారు. ఏది కొనియ్యకపోయినా, లేదా పక్క వాళ్లు తిట్టారని, హోం వర్క్ చేయలేదని, ఏదో వస్తువు కిందపడిపోయిందని, కిందపడ్డారని ఇలా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటారు. కానీ ఇది మీ పిల్లల్ని బలహీనంగా చేస్తుంది. అందుకే మీ పిల్లల్ని దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ చిట్కాలు మీ పిల్లలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కొనేలా చేస్తాయి. 

25
Crying baby

Crying baby

చెప్పేది వినండి

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏదేదో మాట్లాడుతారని, బుర్ర తింటారని అనుకుంటారు. అందుకే పిల్లల మాట అస్సలు వినరు. కానీ పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా వినాలి. ఇది పిల్లలకు చాలా అవసరం.మీరు వారి మాట వింటే.. వారికి ఒక ధైర్యం కలుగుతుంది. ఇది మీ పిల్లల్ని బలంగా చేస్తుంది. 
 

35


ప్రశంస

పిల్లలు చెడు పనులు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు కొట్టడమో, తిట్టడమో, మందలించడమో ఖచ్చితంగా చేస్తుంటారు. కానీ పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు మాత్రం పొగడరు. ఇది మీ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే ప్రశంసించండి. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 

45

ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పండి

మీ పిల్లలకు ఏదైనా సమస్యలు వస్తే వారికి దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పించండి. ఇది వాళలు తమను తాము పూర్తిగా నమ్మడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అలాగే వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
 

55


భావాల గురించి మాట్లాడండి

ప్రతి ఒక్కరికీ భిన్నమైన భావాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినా.. వాటి గురించి మాత్రం పట్టించుకోరు. ముఖ్యంగా పిల్లల విషయంలో.  అందుకే పిల్లల భావాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాటి గురించి పిల్లలకు చెప్పాలి. అప్పుడే పిల్లలు వారి స్వంత, ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Recommended image3
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved