చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పాల్సిన విషయాలు ఏంటో తెలుసా?
పిల్లలు మంచిగా ప్రవర్తించినా, చెడుగా ప్రవర్తించినా తల్లిదండ్రులనే అంటారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు పిల్లలకు ఏదీ నేర్పలేదని అంటుంటారు. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పడకూడదంటే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే కొన్ని విషయాలను నేర్పాలి. అవేంటంటే?
పిల్లలు ఏది చేసినా.. తల్లిదండ్రుల పెంకాన్నే అంటుంది సమాజం. పిల్లలు కొంటె పనులు ఖచ్చితంగా చేస్తారు. ఇది సహజం. కానీ పిల్లల ప్రవర్తన ఎప్పుడూ తప్పుడు దారిలో ఉంటే మాత్రం సమాజం దాన్ని గమనిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులుగా మీకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే పిల్లలకు మంచి అలవాట్లను నేర్పడం చాలా అవసరం. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాల్సిన చిన్న చిన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇతరులకు సహాయం చేయడం
చిన్న పిల్లలకు తమ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడాన్ని నేర్పాలి. సహాయం చేయడంలో పిల్లలు ఎప్పుడూ ముందుండేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇది పిల్లలకు మంచి అలవాటును నేర్పడమే కాకుండా తల్లిదండ్రులుగా సమాజంలో మీకు మంచి పేరు కూడా వస్తుంది. సహాయం చేసే గుణం నుంచి ఏర్పడే భావోద్వేగం వారికి మరింత ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ పిల్లలు ఒక బృందంగా ఏర్పడి పనిచేయడం కూడా నేర్చుకుంటారు.
భాగస్వామ్యం
చిన్న పిల్లలకు తమ వస్తువులను ఒకరితో ఒకరు పంచుకోవడం కూడా ఖచ్చితంగా నేర్పాలి. అలాగే తోటివారితో సామరస్యంగా జీవించడం నేర్పాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు ఇతర పిల్లలతో సంతోషంగా ఉండటం నేర్చుకుంటారు. అలాగే వారిలో వారికి వివక్ష అనే భావన అసలే ఉండదు.
ప్రజలను పలకరిస్తూ..
జనాలను కలవడం. వారిని పలకరించడం కూడా మంచి ప్రవర్తన. కాబట్టి మీ పిల్లలకు కూడా ఈ అలవాటును నేర్పండి. పిల్లలు ప్రజలను పలకరించడం నేర్చుకున్నప్పుడు, అది వారి వ్యక్తిత్వంలో మంచి మార్పులకు దారితీస్తుంది. పెద్దల నుంచి పిల్లల వరకు వీరిని ఎక్కువగా ప్రేమిస్తారు.
పెద్దలను గౌరవించడం నేర్పండి
బయటే కాదు ఇంట్లో ఉన్న పెద్దలను కూడా గౌరవించడం పిల్లలకు నేర్పించండి. పెద్దలను కలిసినప్పుడు వారి ముందు ఎలా ప్రవర్తించాలో నేర్పండి. అలాగే వారు చెప్పేది వినమని చెప్పండి.
స్వేచ్ఛ
పిల్లలకు స్వేచ్ఛను ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే కొన్ని విషయాలలో పిల్లలను బాల్యం నుంచి స్వావలంబన సాధించడం కూడా చాలా ముఖ్యం. వీలైతే వారే స్వయంగా తిననివ్వండి. చాలాసార్లు పిల్లలను ముద్దుపెట్టే విషయంలో తల్లిదండ్రులు పెద్దయ్యాక కూడా చాలా ముద్దు పెడుతుంటారు. కానీ ఇలా తల్లిదండ్రులు చేయకూడదు.