చిన్నపిల్లలు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
చిన్న పిల్లలు తరచుగా ఏడుస్తుంటారు. వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ పిల్లలు కొన్ని కారణాల వల్లే ఎక్కువగా ఏడుస్తారు. వాళ్ల ఏడుపును ఆపడానికి మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
crying baby
చిన్న పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకుని అకస్మత్తుగా ఏడుస్తుంటారు. కొన్ని కొన్ని సార్లైతే చాలా సేపటి వరకు అలాగే ఏడుస్తూనే ఉంటారు. అసలు వీళ్లు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలు కంటిన్యూగా ఏడిచే సరికి భయపడిపోతుంటారు. అంతేకాక వాళ్ల ఏడుపును ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆపరు.
Crying baby
ముఖ్యంగా ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన తల్లిదండ్రులకు అర్ధరాత్రి బిడ్డ ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఒక్కోసారి ఎందుకు ఏడుస్తుందో తెలియక తల్లులు ఏడుస్తుంటారు. ఏడుపును ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు ఏడుస్తూనే ఉంటారు.
crying baby
బిడ్డ ఏడుస్తున్నంత మాత్రాన డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకోకూడదు. మీరు అన్ని ప్రయత్నాలు చేసినా మీ బిడ్డ ఏడుపు ఆపకూడదంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అయితే చాలా మంది తల్లులు కడుపు నొప్పి వల్లే బిడ్డ ఏడుస్తుందని అనుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు కడుపు నొప్పి వల్ల ఏడవరు. కడుపునొప్పి వల్లే ఏడుస్తున్నాడని మీకు మీరే కన్ఫామ్ చేసుకోకూడదు.
Crying baby
కొంతమంది పిల్లలు కారణం లేకుండా కూడా ఏడుస్తుంటారు. దీన్నే కోలిక్ అంటారు. ఈ సమస్యకు పిల్లలను హాస్పటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చాలా మంది పిల్లలు పొద్దంతా నిద్రపోతారు. రాత్రిళ్లు రాత్రి మేల్కొంటారు. రాత్రి అందరం నిద్రపోతున్నప్పుడు చీకట్లో తల్లిని వెతుక్కుంటూ ఉంటాడు. తనచుట్టూ ఏవరూ లేరని కూడా ఏడవడం మొదలుపెడతాడు.
Crying baby
పిల్లల ఏడుపును ఆపడానికి ఏం చేయాలి?
ఏడుపు ఆపడానికి మీ బిడ్డను భుజంపై కొన్ని నిమిషాలు ఉంచండి.
అయినా ఇంకా ఏడుస్తూనే ఉంటే పాలివ్వండి. పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తుంటే పాలు సరిపోలేదని అనుకోకండి.
మీ బిడ్డను ఆరుబయట గాలికి తీసుకెళ్లండి. చల్లగాలికి ఏడుపు ఆపేసి వెంటనే నిద్రలోకి జారుకుంటుంది.
బిడ్డకు జలుబు చేసి ముక్కు ముక్కు మూసుకుపోయినప్పుడు కూడా ఏడుస్తుంది. ఎందుకంటే దీనివల్ల వారు సరిగ్గా శ్వాస తీసుకోలేరు.
చెవి నొప్పులు, మలబద్దకం సమస్యలుంటే కూడా పిల్లలు ఏడుస్తారు. ఇలాంటప్పుడు పిల్లల్ని వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లాలి.