పిల్లలకు మెచ్చే... ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లు ఇవి....!
పిల్లలు రోజుంతా ఉత్సాహంగా ఉండాలి అంటే... వారికి ఉదయం అల్పాహారం చాలా అవసరం. కాబట్టి.... వారు ఏరోజు మిస్ కాకుండా వారికి అల్పాహారం అందించాలి.
children breakfast
పిల్లలు తినే ఆహారం విషయంలో చాలా మొండిగా ఉంటారు. మనం ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు పెట్టాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. వారు మాత్రం అలాంటి ఫుడ్స్ తినడానికి ఇష్టపడరు. కానీ... పిల్లలకు మెచ్చేలా... అదేవిధంగా.. వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి అంటే... ఈ కింది బ్రేక్ ఫాస్ట్ లు ప్రయత్నించండి.
పిల్లలు రోజుంతా ఉత్సాహంగా ఉండాలి అంటే... వారికి ఉదయం అల్పాహారం చాలా అవసరం. కాబట్టి.... వారు ఏరోజు మిస్ కాకుండా వారికి అల్పాహారం అందించాలి.
1.పన్నీర్, క్యాప్సికమ్ శాండ్ విచ్..
పన్నీర్ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకలు, దంతాలను బలం చేకూర్చడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. దానికి తోడు.. క్యాప్సికం లాంటి కూరగాయలు కూడా జత చేయడంతో... మరింత ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. పిల్లలకు శాండివిచ్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీటిని ఇష్టంగా తింటారు.
2.పీనట్ బటర్, బనానా టోస్ట్..
ఆరోగ్యకరమైన ఆహారం పీనట్ బటర్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి... పిల్లలకు పీనట్ బటర్, బనానా టోస్ట్... ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఎదగడానికి సహాయం చేస్తుంది.
3.ఎగ్ బుర్జీ శాండ్ విచ్..
కోడిగుడ్డులో హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. పిల్లల్లో ఎనర్జీ లెవల్స్ పెరగడానికి కూడా సహాయపడతాయి.
4.దోశ..
దోశల్లో కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. పిల్లలను ఎక్కువ సేపు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తాయి.
Image: Freepik
5.లెమన్ రైస్..
లెమన్ రైస్ ఫుల్ ప్యాక్డ్ మీల్స్. దీనిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి ఈ విటమిన్ సి ఎంతగానో సహాయం చేస్తుంది.
Image: Freepik
6.రవ్వ ఉప్మా..
ఉప్మా కూడా ఆరోగ్యానికి మంచిదే. అప్పుడప్పుడు పిల్లలకు అందించవచ్చు. ఇది చాలా తొందరగా అరుగుతుంది. దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Breakfast
7.పోహ..
అటుకులతో తయారు చేసే సింపుల్ బ్రేక్ ఫాస్ట్ . దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పోహ తినడం వల్ల.. పిల్లలు.. రోజంతా చురుకుగా ఉంటారు.
Pancake
8.ప్యాన్ కేక్...
బనానా ప్యాక్ కేక్ లు పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి. అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
9.ఓట్స్..
చాలా మంది పిల్లలకు ఓట్స్ పెట్టకూడదు అని అంటూ ఉంటారు. కానీ... నిజానికి పిల్లలకు ఓట్స్ పెట్టొచ్చు. అందులో... ఫైబర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఓట్స్ లో బెల్లం కలపడం వల్ల.. వారికి ఐరన్ కూడా లభిస్తుంది. దీనిలోనే జీడిప్పు, బాదంపప్పులను కూడా జత చేసి వారికి అందించవచ్చు.