MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ఇదొక్కటి చేసినా మీ పిల్లల కళ్లు బాగా కనిపిస్తాయి

ఇదొక్కటి చేసినా మీ పిల్లల కళ్లు బాగా కనిపిస్తాయి

నేటికాలం పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. స్కూల్ నుంచి రాగానే ఫోన్ లో ముఖం దూరుస్తారు. కానీ ఫోన్ వల్ల పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా కంటిచూపు చాలా తగ్గుతుంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 19 2024, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రోజంతా మొబైల్ ఫోన్లును, టీవీని చూడటం పిల్లలకు ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ అలవాటు పిల్లల కంటిచూపును తగ్గిస్తుంది. పిల్లలకు తోడు పెద్దలు కూడా ఫోన్లకు అత్తుకునే ఉంటున్నారు. పెద్దవాళ్లను చూసి కూడా పిల్లలు ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా పేరెంట్సే టీవీలో కర్టూన్ లు పెట్టి పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెడుతున్నారు.

కానీ టీవీ, ఫోన్ స్క్రీన్ వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కళ్లు కూడా దెబ్బతింటాయి. టీవీ, ఫోన్లను ఎక్కువగా చూసే పిల్లలకు కళ్లు సరిగ్గా కనిపించవు. కాబట్టి పిల్లల కంటిచూపును మెరుగుపర్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మీ పిల్లల కంటి చూపును మెరుగుపరచాలనుకుంటే ముందుగా వారు ఫోన్లను, టీవీ ని ఎక్కువగా చూడకుండా చేయాలి. ఒకవేళ పిల్లలు ఆ అలవాటును మానకపోతే ఫోన్లను చూడటం వల్ల వచ్చే సమస్యలేంటో చెప్పండి. దీంతో వారికి భయం కలుగుతుంది. ఫోన్లను ఎక్కువగా చూడొద్దన్న ఆలోచన వస్తుంది. 

 

35
kids

kids

కళ్లకు విశ్రాంతి చాలా అవసరం. కానీ కరోనా కాలం నుంచి పిల్లలు ఫోన్ లోనే చదువుకున్నారు. పాఠాలు విన్నారు. దీంతో పిల్లలు రోజంతా ఫోన్లను చూస్తూ వచ్చారు. ఈ అలవాటు పిల్లల్ని ఫోన్లకు బానిసలుగా చేసింది. కానీ ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మీ పిల్లలు ఫోన్లలో ఎక్కువగా చదువుకోకుండా చేయండి. 

45
Kids food

Kids food

పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడటం వల్ల వారి కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది మొదట్లో ఎలాంటి హాని చేయదు. కానీ రానురాను మీ పిల్లల కళ్లు కనిపించకుండా చేస్తుంది. కాబట్టి మీ పిల్లలు ఫోన్లు ఎక్కువ సేపు చూడకుంా చేయండి. మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు తీసుకెళ్లండి. 

55


ఆహారం

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ఆహార మార్పులు కూడా చేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను చూడటం వల్ల కళ్లు పొడిబారుతాయి. ఇలా కాకూడదంటే మీ పిల్లలకు వాల్ నట్స్, సోయా బీన్స్, ఒమేగా 3 ఎక్కువగా ఉండే చేపలను పెట్టండి.

వీటితో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యారెట్, నారింజ పండ్లను కూడా వారి రోజువారి ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే అవసరమైన విటమిన్లు, పోషకాలు యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved