- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?
Parenting Tips: పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?
రాత్రికి రాత్రే ఏ మ్యాజిక్ జరిగిపోదు. దానికి చాలా సమయం పడుతుంది.ఆత్మవిశ్వాసం అనేది నెమ్మదిగా, స్థిరమైన ప్రేమ, ప్రోత్సాహం,ఇంట్లో వారిని ఎలా చూసుకుంటారు అనే దాని ద్వారా ఏర్పడుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ రోజుల్లో పిల్లలు ఏ రంగంలో ముందుకు దూసుకుపోవాలన్నా, వారు ఏది సాధించాలన్నా వారిలో కాన్ఫిడెన్స్ ఉండటం చాలా ముఖ్యం. మరి, ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? మనం ఏం చేస్తే పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందో తెలుసుకుందాం..
పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి పేరెంట్స్ తమ వంతు ప్రయత్నాలు చేయాలి. మనం చేసే కొన్ని పనులే వారిలో ఆత్మ విశ్వాసం పెరగడానికి కారణం అవుతాయి. అయితే.. రాత్రికి రాత్రే ఏ మ్యాజిక్ జరిగిపోదు. దానికి చాలా సమయం పడుతుంది.ఆత్మవిశ్వాసం అనేది నెమ్మదిగా, స్థిరమైన ప్రేమ, ప్రోత్సాహం,ఇంట్లో వారిని ఎలా చూసుకుంటారు అనే దాని ద్వారా ఏర్పడుతుంది.
చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించడం..
పిల్లలకు ప్రతిదీ తామే స్వయంగా చేయాలని, వారికి ఏది మంచిదో తామే సెలక్ట్ చేయాలి అని అనుకుంటారు. ఇలాంటి పేరెంట్స్ ఉంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగదు. కాబట్టి.. వారి లైఫ్ లో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే అనుమతి మనం పిల్లలకు ఇవ్వాలి. అంటే.. వారు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలాంటి స్నాక్స్ తినాలి లాంటి చిన్న చిన్న విషయాలు అయినా వారికి వదిలేయాలి. ఈ సాధారణ అలవాటు నిర్ణయం తీసుకోవడం నేర్పుతుంది. వారిలో ఆలోచించే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
ఫలితం కన్నా, ప్రయత్నం ముఖ్యం..
చాలా మంది పేరెంట్స్ పిల్లలు చదువులు, ఆటల్లో విజయం సాధించకపోతే అది పిల్లల తప్పు అన్నట్లు చూస్తారు. అయితే అలా చూడకూడదు. ప్రతి దాంట్లో పిల్లలు విజయం సాధించాలనే కోరిక ఉండొచ్చు. తప్పులేదు. కానీ వారు విజయం సాధించలేకపోతే వారి ప్రయత్నాన్ని, వారు పడిన కష్టాన్ని గుర్తించాలి. దానిని మాత్రం మెచ్చుకోవాలి.అప్పుడు మరోసారి ప్రయత్నించాలనే ఉత్సాహం పిల్లల్లో కలుగుతుంది. అది కూడా కాన్ఫిడెన్స్ పెంచుతుంది.
పిల్లలు చెప్పేది వినాలి..
తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేది నిజంగా వినాలి.పేరెంట్స్ వినడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలు తమను తాము బహిరంగంగా ,నిజాయితీగా వ్యక్తీకరించడానికి విశ్వాసాన్ని ఇస్తుంది.
వారి అభిప్రాయాన్ని చెప్పడానికి వారిని ప్రేరేపించడం
పిల్లలను ప్రశ్నలు అడగడానికి, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి లేదా గౌరవంగా విభేదించడానికి అనుమతించడం ద్వారా వారి ఆలోచనలకు విలువ ఉందని వారికి నేర్పుతుంది. ఇది పాఠశాలలో, తోటివారితో,తరువాత జీవితంలో మాట్లాడటానికి ధైర్యాన్ని పెంచుతుంది.
ప్రేమను అర్థవంతంగా వ్యక్తపరచండి
"నిన్ను ప్రేమిస్తున్నాను" అనే చిన్న మాట, ఆలింగనం లాంటి వెచ్చని హావభావాలు పిల్లల హృదయాల్లో ఓ బలమైన భద్రతా భావాన్ని నింపుతాయి. ఇలా ప్రేమను ఓపికగా వ్యక్తపరిచే తల్లిదండ్రుల పిల్లలు, సురక్షితమైన వాతావరణంలో పెరిగి, తమపై గాఢమైన నమ్మకాన్ని పెంచుకుంటారు.
తప్పుల నుంచి నేర్చుకోవడం..
పిల్లలు పొరపాట్లు చేయడం సహజం. పాలు చిందించటం, ఆటలో ఓడిపోవడం వంటి చిన్న అనుభవాలను ఓపికగా స్వీకరిస్తే, వారు తప్పులు చేయడం నేర్చుకుంటారు. ఇది సమస్యలను పరిష్కరించడంలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది, పరిపూర్ణత భయాన్ని తగ్గిస్తుంది.
మంచి లక్షణాలకు గుర్తింపు ఇవ్వండి
పిల్లల్లో కనబడే దయ, సహనం, ఉత్సుకత వంటి గుణాలను ప్రశంసించండి. ఇది వారు ఎంత అందంగా ఉన్నారో కాదు, వారు చేసే మంచి పనులు ఎంత విలువైనవో తెలుసుకునే మార్గం. ఇలా చేస్తే వారు ఇతరుల అంగీకారాన్ని కాదు, తమంతట వారు నమ్మకం పెంచుకుంటారు.
చిన్న బాధ్యతల ద్వారా నమ్మకాన్ని కలిగించండి
వంటగదిలో చిన్న పనులు చేయడం, వారి బ్యాగ్‌ను సర్దుకోవడం వంటి పనులను అప్పగించండి. మీరు వారిని నమ్ముతున్నారని వాళ్లకు అనిపిస్తే, వారు కూడా తమపై నమ్మకం పెంచుకుంటారు. ఇది వారిలో స్వతంత్రతను, నైతిక బాధ్యతను పెంచుతుంది.
చిన్న సాహసాలను ప్రోత్సహించండి
కొత్త ఆటను ప్రయత్నించడం, ఓ చిన్న చెట్టు ఎక్కడం వంటి సురక్షితమైన రిస్కులు తీసుకునే అవకాశం ఇవ్వండి. పిల్లలు తమకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయుక్తం. ఇది ధైర్యాన్ని, కొత్త ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
మీరు మోడల్ అవ్వండి
పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తూ పెరుగుతారు. మీరు ఎదురైన కష్టాలను ప్రశాంతంగా ఎదుర్కొంటే, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ధైర్యంగా ఉండితే, అదే వారు నేర్చుకుంటారు. మీ ప్రవర్తనలో ఉండే నమ్మకం, ప్రేమ, సహనం – వారిలోనూ నిశ్శబ్దంగా ప్రతిబింబిస్తాయి.