Breast Milk: పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కచ్చితంగా తినాల్సినవి ఇవే..!
Breast Milk: ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత... తాము తీసుకునే ఫుడ్ విషయంలో కేర్ లెస్ గా ఉండటం మొదలుపెడతారు. బరువు తగ్గాలి అని ఫుడ్ సరిగా తీసుకోరు. పోషకాలు ఉన్న ఆహారాన్ని అసలు తీసుకోరు. దీని వల్ల బలహీనంగా మారిపోతారు.

డెలివరీ తర్వాత...
తల్లి గా మారడాన్ని ప్రతి తల్లీ ఆస్వాదిస్తుంది. బిడ్డ కడుపులో ఉన్న సమయంలో దాదాపు అందరు స్త్రీలు తాము తీసుకోవాల్సిన ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత... తాము తీసుకునే ఫుడ్ విషయంలో కేర్ లెస్ గా ఉండటం మొదలుపెడతారు. బరువు తగ్గాలి అని ఫుడ్ సరిగా తీసుకోరు. పోషకాలు ఉన్న ఆహారాన్ని అసలు తీసుకోరు. దీని వల్ల బలహీనంగా మారిపోతారు. అంతేకాకుండా... ఆరు నెలల పాటు తల్లి కచ్చితంగా బిడ్డకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల.. బిడ్డకు ఇవ్వడానికి పాలు కూడా ఉండవు. దీని వల్ల మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అలా జరగకుండా ఉండాలంటే..మీరు, మీతో పాటు... మీ బిడ్డ ఆరోగ్యం గా ఉండాలంటే..మీ డైట్ లో కొన్ని ఫుడ్స్ ని కచ్చితంగా చేర్చుకోవాలి. మరి, ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం....
ప్రోటీన్...
సాధారణంగా, తల్లులకు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు అదనపు ప్రోటీన్, కేలరీలు ఉన్న ఆహారం చాలా అవసరం. ఈ పోషకాలు సరిగా అందినప్పుడు మాత్రమే.... తల్లి పాలు సరిగా ఉంటాయి. ఆ పాలు కూడా క్వాలిటీ గా ఉంటాయి. అప్పుడు మాత్రమే పిల్లల శారీరక అభివృద్ధి బాగుంటుంది. అందుకే... రెగ్యులర్ గా పాలు, గుడ్లు, చేపలు, పప్పులు, చికెన్, మటన్ లాంటివి తీసుకోవాలి. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచి నీళ్లు తాగాలి.
మెంతులు...
తరువాత, మీరు మీ ఆహారంలో మెంతులను చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి ఉండదు. అంతేకాకుండా ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శిశువు మెదడు అభివృద్ధికి కూడా సహాయపడతాయి.
ఆకు కూరలు, వెల్లుల్లి...
పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో ఆకుకూరలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. మునగ ఆకు, పాలకూర, మెంతి కూర లాంటివి రోజుకి కనీసం ఒక్క ఆకు కూర అయినా తినాలి. వీటిలో ఉండే కాల్షియం , ఫైబర్ పిల్లల శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు.. వెల్లుల్లి కూడా డైట్ లో భాగం చేసుకోవాలి. నల్ల ఎండు ద్రాక్ష తీసుకున్నా కూడా పాలు బాగా వస్తాయి. అంతేకాకుండా... ఆరోగ్యంగా ఉండేందుకు..బాదం పప్పు, జీడి పప్పు, ఖర్జూరం, అంజూర వంటి వాటిని తినాలి. ఇవి కూడా పాల ఉత్పత్తిని పెంచుతాయి.
కార్బోహైడ్రేట్స్...
చాలా తల్లులు బరువు పెరుగుతామనే భయంతో అన్నం తక్కువగా తింటారు. కానీ కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. కాబట్టి అన్నం, చపాతీ, మిల్లెట్ ఫుడ్స్ (జొన్న, రాగి, సజ్జ) ను పరిమిత మోతాదులో తినాలి. ఆకలిని చంపుకోకూడదు.
పండ్లు
పప్పులు, ఆకుకూరలు మాత్రమే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా నారింజ, మామిడి, సీతాఫలం, అరటి వంటి పండ్లు శక్తినిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
హల్దీ పాలు
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి పాలు, అందులో కొంచెం పసుపు కలిపి తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, ప్రసవానంతర నొప్పులు తగ్గుతాయి.