MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • 5ఏళ్లలోపు పిల్లలకు పేరెంట్స్ ఏం నేర్పాలో తెలుసా?

5ఏళ్లలోపు పిల్లలకు పేరెంట్స్ ఏం నేర్పాలో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విషయాలు, క్రమ శిక్షణ నేర్పించాలనే అనుకుంటారు. వీలైనంత వరకు పిల్లలకు ప్రతి నిమిషం చెబుతూనే ఉంటారు. అయితే.. కొన్ని విషయాలు మాత్రం  ఐదేళ్లలోపు మాత్రమే నేర్పించాలట. అలాంటివి ఏంటో చూద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
| Updated : Nov 18 2024, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు పేరెంట్స్ వారికి గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. వారికి ప్రతి విషయంలోనూ అండగా ఉంటూ, సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే..కొన్ని విషయాలు మాత్రం పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాలట. ఎందుకు అంటే.. పిల్లల ఐదేళ్ల జీవితం చాలా ముఖ్యమైనది. ఐదేళ్ల లోపు వయసు అనేది వారికి పునాది లాంటిది. పునాది గట్టిగా ఉంటేనే వారి జీవితం బాగుంటుంది. మనం ఎలాంటి మంచి విషయాలు నేర్పించాలన్నా.. ఇదే కరెక్ట్ వయసు. మరి కచ్చితంగా పేరెంట్స్ ఐదేళ్ల లోపు తల్లిదండ్రులకు ఎలాంటి విషయాలు, లక్షణాలు నేర్పించాలి అనే విషయం  చూద్దాం...

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పేరెంటింగ్ చిట్కాలు

పేరెంటింగ్ చిట్కాలు

ఐదేళ్లలోపు పిల్లలకు నేర్పించాల్సిన  లక్షణాలు..

పెద్దలను గౌరవించడం, వినయం..

పిల్లలకు చిన్న వయసులో కచ్చితంగా నేర్పించాల్సిన మొదటి లక్షణం పెద్దలను గౌరవించడం, వినయంగా ఉండటం. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడే సమయంలో   ఎల్లప్పుడూ మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలని నేర్పించాలి. దీనితో పాటు, మర్యాదపూర్వకమైన పదాలు, క్షమించండి, ధన్యవాదాలు, దయచేసి వంటి సాధారణ పదాలను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించడం అవసరం.

షేరింగ్ ఈజ్ కేరింగ్

షేరింగ్ ఈజ్ కేరింగ్ కూడా పిల్లలకు నేర్పించాలి. మన దగ్గర ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం గురించి పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. ఎందుకంటే ఈ లక్షణం పిల్లల స్నేహాన్ని పెంపొందించడానికి, సామాజిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు బొమ్మలు, స్నాక్స్ లేదా ఇతర వస్తువులను పంచుకోవడానికి వారిని ప్రోత్సహించాలి.

35

భావాలను వ్యక్తపరచడం

పిల్లలు తమ భావాలను ఎలా వ్యక్తపరచాలో తల్లిదండ్రులు నేర్పించాలి. అంటే కోపం, బోర్, నిరాశ, అసహనం వంటి పదాలను భావాల ద్వారా ఎలా వ్యక్తపరచాలో నేర్పించండి.

పరిశుభ్రత 

పిల్లలకు విద్యతో పాటు పరిశుభ్రత వంటి కొన్ని ప్రాథమిక విషయాలను కూడా నేర్పించడం ముఖ్యం. అంటే, భోజనానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. దీనితో పాటు, బయట ఆడుకున్న తర్వాత చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. అంతేకాకుండా, పళ్ళు సరిగ్గా తోముకోవాలి, ప్రతిరోజూ స్నానం చేయాలి. ఇలాంటి మంచి విషయాల ప్రాముఖ్యతను నేర్పించి, ప్రోత్సహించాలి. ఇది వారి మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది.

45
పేరెంటింగ్ చిట్కాలు

పేరెంటింగ్ చిట్కాలు

సలహాలు వినడం

మీ పిల్లలు మీరు చెప్పే మాటలు, సలహాలు వినేలా అలవాటు చేయండి. అలాగే పెద్దల మాటలకు విలువివ్వాలని చెప్పండి. దీని ద్వారా వారిలో బాధ్యత పెరుగుతుంది.

స్వీయ నిర్ణయం

పిల్లల చిన్న వయసు నుండే వారికి ఈ లక్షణాలను ప్రోత్సహించడం వలన వారు సమర్థవంతంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు వారి దుస్తులను ఎంచుకోవడం. దీని ద్వారా వారు స్వతంత్ర ఆలోచనతో ఎదుగుతారు.

55
పేరెంటింగ్ చిట్కాలు

పేరెంటింగ్ చిట్కాలు

సమయం  ప్రాముఖ్యత

చిన్నప్పటి నుండే పిల్లలకు సమయం  ప్రాముఖ్యతను నేర్పించడం అవసరం. వారికి ఒక టైమ్ టేబుల్ వేసి, దాని ప్రకారం సమయం  ప్రాముఖ్యతను నేర్పించండి. దానిని పాటించడానికి ప్రోత్సహించండి.

 ఆసక్తిని పెంపొందించడం

పిల్లల ఆసక్తిని తెలుసుకొని, దానిలో వారిని ప్రోత్సహించడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. మీ పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రశ్నలు అడగడానికి వారిని ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లల సృజనాత్మకత పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved