పిల్లలు రాత్రిపూట చదివితే ఏమౌతుందో తెలుసా?
నైట్ 11,12 గంటల దాకా చదివి, ఉదయాన్నే దాన్ని రివిజన్ చేసుకుంటుంటారు చాలా మంది పిల్లలు. కానీ ఇలా రాత్రిపూట చదివితే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది ఉదయం చదివితేనే ఎక్కువగా గుర్తుంటాయి. అప్పుడే చదవడం ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. అందుకే రాత్రిపూట పిల్లల్ని చదవొద్దని తొందరగా పడుకుని ఉదయాన్నే లేచి చదవమని పేరెంట్స్ చెప్తుంటారు.
కానీ రాత్రిపూట చదివినా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పగటిపూట కంటే రాత్రిపూట చదువుకోవడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయట. అసలు రాత్రిపూట పిల్లలు చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాత్రి చదువు ప్రయోజనాలు
పిల్లలు రాత్రిపూట చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.ప్రశాంతమైన వాతావరణం
మధ్యాహ్నం, పగలు కంటే రాత్రిపూటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందట. ఎందుకంటే ఈ టైంలో బయటినుంచి ఎలాంటి సౌడ్స్ వినిపించవు. దీనితో మీరు ప్రశాతంగా చదువుకోవచ్చు. వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే.. చదవుపై అంత దృష్టి పెట్టగలుగుతారు. అలాగే చదువుతున్న పాఠాన్ని సులభంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. రాత్రిపూట చదివిన విషయాలు బాగా గుర్తుండిపోతాయి.
2. సృజనాత్మక ఆలోచన:
నిపుణుల ప్రకారం.. రాత్రి చదివితే పిల్లల్లో సృజనాత్మక ఆలోచన పెరుగుతుంది. అలాగే ఈ టైంలో పిల్లలకు కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే ఎలా చదివితే సులువుగా గుర్తిండిపోతాయో కూడా తెలుసుకుంటారు.
3. మనస్సు చురుగ్గా ఉంటుంది:
మీకు తెలుసా? మన మెదడు రాత్రిపూట చాలా చురుగ్గా పనిచేస్తుంది.అందుకే ఈ టైంలో చదివితే వాటిని తొందరగా గుర్తించుకుంటారు. అలాగే అర్థం చేసుకుంటారు. మెదడు ఎంత చురుగ్గా ఉంటే.. చదివిన వాటిని అంత బాగా గుర్తించుకోగలుగుతారు. చదవగలుగుతారు.
4. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు
పగలు అయితే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అదే రాత్రిపూటైతే మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. అంతేకాకుండా మీరు మీకు నచ్చినట్టుగా చదవొచ్చు.
5. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
పగటిపూట కంటే రాత్రిపూట చదివితే పిల్లలు మానసిక ఒత్తిడికి గురికారు. అలాగే ఈ సమయంలో పిల్లల మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చదివి నిద్రపోవడం వల్ల బాగా నిద్రపడుతుంది. అంటే చదివింది అయిపోగానే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. ఎలాంటి టెన్షన్ ఉండదు. అంతేకాకుండా పిల్లల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
6. ఎక్కువ శ్రద్ధ
ఉదయం, పగటిపూట చదివేటప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫోన్, సోషల్ మీడియా ఇలా.. చాలా వాటిపై మన ఇంట్రెస్ట్ మళ్లుతుంటుంది. దీనివల్ల చదువుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి రాత్రిపూట చదివితే ఇదేం ఉండదు. పూర్తి శ్రద్ధతో చదువుపై పిల్లలు దృష్టి పెడతారు.