MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Other Sports
  • Lovlina Borgohain: బర్త్‌డే రోజున హిస్టరీ క్రియేట్ చేసిన లవ్లీనా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

Lovlina Borgohain: బర్త్‌డే రోజున హిస్టరీ క్రియేట్ చేసిన లవ్లీనా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

Lovlina Borgohain: ఆసియా గేమ్స్ లో తన పుట్టినరోజున భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 75 కేజీల బాక్సింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. మేరీ కోమ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళగా నిలిచారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 02 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చైనా బాక్సర్‌కు చుక్కలు చూపించిన భారత సింగం.. మేరీ కోమ్ రికార్డు సమం చేసిన లవ్లీనా
Image Credit : Getty

చైనా బాక్సర్‌కు చుక్కలు చూపించిన భారత సింగం.. మేరీ కోమ్ రికార్డు సమం చేసిన లవ్లీనా

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ అద్భుత ఘనత సాధించారు. తన 29వ పుట్టినరోజున మహిళల 75 కేజీల బాక్సింగ్ ఫైనల్లో స్వర్ణ పతకం గెలుచుకుని దేశానికి మరపురాని బహుమతి అందించారు.

నిషియో జిమ్నాషియంలో శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో చైనాకు చెందిన 2026 ఆసియా ఛాంపియన్ బావో జియిని 5-0 తేడాతో లవ్లీనా చిత్తు చేశారు. ఈ విజయంతో ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా ఘనత సాధించారు. గతంలో 2014 దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Lovlina Borgohainఫైనల్ పోరులో లవ్లీనా పూర్తి ఆధిపత్యం
Image Credit : X/Media_SAI

Lovlina Borgohainఫైనల్ పోరులో లవ్లీనా పూర్తి ఆధిపత్యం

చైనా బాక్సర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా మొదటి నుంచీ చాలా పక్కా ప్లాన్‌తో ఆడారు. తన ఎత్తును, సుదీర్ఘ పంచ్‌ల రేంజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మొదటి రౌండ్‌‌లో ఇద్దరి మధ్య గట్టి పోటీ నడిచినా, లవ్లీనా 3-2తో ఆధిక్యం సాధించారు.

రెండో రౌండ్‌లో చైనా బాక్సర్ దాడికి ప్రయత్నించినప్పటికీ, లవ్లీనా డిఫెన్స్ చేస్తూనే బలమైన పంచ్‌లతో విరుచుకుపడి 4-1తో ఆ రౌండ్‌ను కైవసం చేసుకున్నారు. మూడో రౌండ్‌లోనూ అదే వేగాన్ని కొనసాగిస్తూ 4-1తో గెలిచి, జడ్జెస్ ఏకగ్రీవ నిర్ణయంతో 5-0 తేడాతో స్వర్ణాన్ని ముద్దాడారు. నలుగురు జడ్జీలు లవ్లీనాకు 29-28 స్కోరు ఇవ్వగా, ఒక జడ్జి 30-27 స్కోరు ఇచ్చారు.

35
ఫైనల్ చేరేవరకు సాగిన ఉత్కంఠ ప్రయాణం
Image Credit : X

ఫైనల్ చేరేవరకు సాగిన ఉత్కంఠ ప్రయాణం

ఈ టోర్నీలో లవ్లీనా ప్రయాణం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సెయాంగ్ సుయోన్‌ను 5-0తో సులువుగా ఓడించి పతకం ఖాయం చేసుకున్నారు. సెమీఫైనల్లో కజకిస్తాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ నటాల్యా బొగ్డనోవాతో తలపడ్డారు. తొలి రౌండ్‌లో 2-3తో వెనుకబడినప్పటికీ, రెండో రౌండ్‌లో 5-0తో పుంజుకుని మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నారు. ఆఖరికి 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించారు.

45
విమర్శకులకు పంచ్.. రికార్డుల వేట
Image Credit : Getty

విమర్శకులకు పంచ్.. రికార్డుల వేట

హ్యాంగ్‌జౌ 2022 ఆసియా గేమ్స్‌లో వెండి పతకంతో సరిపెట్టుకున్న లవ్లీనా, ఈసారి ఎలాగైనా పతకం రంగు మార్చాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగారు. గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత ఎదురైన విమర్శలన్నింటికీ ఈ గోల్డ్ మెడల్‌తో చెక్ పెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన ఈ అస్సాం బాక్సర్, ఖాతాలో ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్, ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాలు ఉన్నాయి. ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు బాక్సింగ్ విభాగంలో వచ్చిన మొదటి గోల్డ్ మెడల్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ గేమ్స్‌లో భారత్‌కు ఇది 12వ స్వర్ణ పతకం.

55
రింగ్‌లో భారత్ మార్క్.. మరిన్ని పతకాల ఆశలు
Image Credit : Getty

రింగ్‌లో భారత్ మార్క్.. మరిన్ని పతకాల ఆశలు

ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత బాక్సింగ్ టీమ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గత హ్యాంగ్‌జౌ గేమ్స్‌లో భారత్ మొత్తం 4 పతకాలు (1 వెండి, 3 కాంస్యాలు) సాధించగా, ఈసారి ఆ సంఖ్యను దాటి ఇప్పటికే 6 పతకాలను ఖాయం చేసుకుంది. ప్రియ గంగాస్ (60 కేజీలు), కపిల్ పోఖరియా (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (+90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

లవ్లీనా స్వర్ణంతో పాటు పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్, మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా కూడా ఫైనల్స్ చేరి గోల్డ్ మెడల్ రేసులో ఉన్నారు. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో వీరు కూడా గెలిస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఆసియా గేమ్స్ లో కబడ్డీలో తిరుగులేని భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పురుషులు, మహిళల జట్లు
Recommended image2
Mirabai Chanu: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Recommended image3
CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !
Related Stories
Recommended image1
World Cup 2027: కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.. మరి రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? గంభీర్ సీక్రెట్ స్కెచ్
Recommended image2
Dream: కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో మెదడు చేసే వింతలు.. సైన్స్ వెల్లడించిన షాకింగ్ నిజాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved