MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. దీంతో ఆడబిడ్డలకు కలిగే ప్రయోజనాలివే..!

అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. దీంతో ఆడబిడ్డలకు కలిగే ప్రయోజనాలివే..!

Women Reservation Act : మహిళా రిజర్వేషన్ చట్టం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది… ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 17 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు..
Image Credit : X

ఇక మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు..

భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది... దీంతో పార్లమెంట్ తో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇలా పాలనాపరమైన వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడంతో పాటు చట్టసభల్లో వారి గొంతు మరింత గట్టిగా వినిపించనుంది. మహిళా సాధికారతకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర్థరాత్రి మహిళా రిజర్వేషన్ చట్టం...
Image Credit : Gemini

అర్థరాత్రి మహిళా రిజర్వేషన్ చట్టం...

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినరోజే ఇది చట్టంగా మారినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదలచేయడం ఆసక్తికరంగా మారింది. మహిళా రిజర్వేషన్ చట్టం-2023 అమల్లోకి వచ్చిందని గురువారం అర్థరాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. 2026 ఏప్రిల్ 16ను మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా కేంద్రం నోటిఫై చేసింది. సాంకేతిక కారణాల వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగానే చట్టం అమలు అయినట్లు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.

35
మహిళా రిజర్వేషన్ చట్టంతో ప్రయోజనాలు..
Image Credit : X

మహిళా రిజర్వేషన్ చట్టంతో ప్రయోజనాలు..

అనాదిగా అణచివేతకు గురయిన మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రంగాల్లోనూ వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కానీ పాలనా వ్యవహారాల్లో మాత్రం మహిళలకు ఇంకా తగిన ప్రాధాన్యం తగ్గడంలేదు... అందుకే వారికి చట్టసభల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది.. అది ఇప్పుడు అమలవుతోంది. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, దేశ గమనాన్ని మార్చే ఒక సామాజిక విప్లవం.

పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు : ఈ చట్టం ప్రకారం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు లభిస్తాయి. అంటే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, డిల్లీ అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించబడతాయి.

కోటాలో కోటా : చట్ట సభల్లో ఇప్పటికే ఎస్సీ (SC), ఎస్టీ (ST) రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో కూడా మహిళలకు 33 శాతం నిబంధన వర్తిస్తుంది.

రొటేషన్ పద్ధతి : ప్రతి నియోజకవర్గ పునర్విభజన తర్వాత రిజర్వ్ చేయబడిన స్థానాలు మారుతూ ఉంటాయి (రొటేషన్ పద్ధతిలో). అంటే ఎక్కువమంది మహిళలకు, ఎక్కువ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు లభిస్తాయి... దీంతో రాజకీయంగా మహిళల ప్రాధాన్యం పెరుగుతుంది.

కాలపరిమితి : ప్రాథమికంగా ఈ చట్టం 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. అవసరమైతే పార్లమెంటు దీనిని పొడిగించవచ్చు.

45
 ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం..?
Image Credit : stockPhoto

ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం..?

గతంలో అనేక ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ, రకరకాల రాజకీయ కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే ప్రస్తుత చట్టం ద్వారా రాజకీయాలు, పాలనలో మహిళల భాగస్వామ్యం కేవలం 'నామమాత్రం' నుంచి 'నిర్ణయాత్మక శక్తి'గా మారనుంది.

55
ఈ చట్టం తీసుకురాబోయే సామాజిక మార్పులు
Image Credit : X

ఈ చట్టం తీసుకురాబోయే సామాజిక మార్పులు

విధాన రూపకల్పనలో సమతుల్యత: మహిళలకు సంబంధించిన సమస్యలు (ఆరోగ్యం, విద్య, భద్రత) పై చట్టసభల్లో మరింత లోతైన చర్చలు జరిగే అవకాశం ఉంది.

నాయకత్వ లక్షణాలు : స్థానిక సంస్థల్లో (పంచాయతీలు) రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే లక్షలాది మంది మహిళా నాయకులు తయారయ్యారు. ఇప్పుడు వారు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం దక్కుతుంది.

లింగ వివక్షతకు ముగింపు : రాజకీయాల్లో పురుషాధిక్యత తగ్గుముఖం పట్టి, లింగ సమానత్వం వైపు అడుగులు పడతాయి.

అమలు ఎప్పుడు?

ఈ చట్టం అమల్లోకి రావడానికి రెండు ప్రధాన ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది.

జనగణన (Census) : దేశవ్యాప్తంగా జనాభా గణన జరగాలి.

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) : జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను తిరిగి విభజించాలి.

ఈ ప్రక్రియలు పూర్తయిన తర్వాత జరిగే సాధారణ ఎన్నికల నుండి మహిళలు ఈ రిజర్వేషన్ల ఫలాలను అందుకోబోతున్నారు.

మహిళా రిజర్వేషన్ చట్టం అనేది కేవలం సీట్ల కేటాయింపు కాదు, అది సగం జనాభాకు ఇస్తున్న గౌరవం. చట్టసభల్లో మహిళల గొంతు బలంగా వినిపించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అమలయినట్లు. 'నవ భారతం' నిర్మాణంలో ఈ చట్టం ఒక బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
మహిళలు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
భారత పార్లమెంటు
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image2
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Recommended image3
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Related Stories
Recommended image1
Now Playing
మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
Recommended image2
Now Playing
Budget 2026: Nirmala Sitharaman Big Surprise for Women Financial Independence | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved