MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !

Women Reservation Act 2023 : మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పార్లమెంటులో చర్చలు జరుగుతున్న తరుణంలోనే, 2023 నాటి మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 17 2026, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మహిళా రిజర్వేషన్ల అమల్లో కీలక మలుపు
Image Credit : ANI

మహిళా రిజర్వేషన్ల అమల్లో కీలక మలుపు

దేశ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2023లో ఆమోదం పొందిన 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ల చట్టం) గురువారం నుంచి నుంచే అమల్లోకి వస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా లభించనుంది. అయితే, దీని అమలు ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన పై పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అకస్మాత్తుగా అమల్లోకి చట్టం.. కారణమేంటి?
Image Credit : Gemini

అకస్మాత్తుగా అమల్లోకి చట్టం.. కారణమేంటి?

కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2026 ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023లోని సెక్షన్-1(2) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుత లోక్‌సభకు ఇది వర్తించదు. రాబోయే జనగణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికన మాత్రమే మహిళలకు సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఒకవైపు పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే, మరోవైపు నోటిఫికేషన్ రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Related Articles

Related image1
ప్రపంచంలో టాప్ 10 బిగ్ డ్యామ్‌లు ఇవే.. భారత్ నుంచి ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసా?
Related image2
ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఇవే.. భారత్ సరికొత్త రికార్డు.. టాప్ 7లో 6 మనవే!
36
దక్షిణాది రాష్ట్రాల సీట్లపై అమిత్ షా ఏమన్నారు?
Image Credit : LOK SABHA

దక్షిణాది రాష్ట్రాల సీట్లపై అమిత్ షా ఏమన్నారు?

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, అన్యాయం జరుగుతుందన్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు. "దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం నష్టం జరగదు. దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యను 50 శాతం పెంచుతున్నాం. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లు 816కి పెరుగుతాయి. పెరిగే సీట్లన్నీ మహిళలకే కేటాయిస్తాం. మిగిలిన సీట్లు యథాతథంగా ఉంటాయి" అని ఆయన ప్రకటించారు.

• ఆంధ్రప్రదేశ్: 25 నుంచి 38 సీట్లకు పెంపు.

• తెలంగాణ: 17 నుంచి 26 సీట్లకు పెంపు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ప్రస్తుతం ఉన్న 24 శాతం వద్దే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

46
విపక్షాల విమర్శలు.. ముసుగులో కుట్ర అంటూ ధ్వజం
Image Credit : X

విపక్షాల విమర్శలు.. ముసుగులో కుట్ర అంటూ ధ్వజం

మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో కేంద్రం దొడ్డిదారిన రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి (INDIA) నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ, "మహిళా రిజర్వేషన్లకు మేం అనుకూలం, కానీ దానికి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఏంటి?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే 33 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ నారీ (మహిళ)ని ఓట్ల కోసం నారా (నినాదం)గా మార్చేసిందని విమర్శించారు. ఇందులో ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా కోటా ఉండాలని డిమాండ్ చేశారు.

56
క్రెడిట్ మీకే ఇస్తా.. సపోర్టు చేయండి : ప్రధాని మోదీ పిలుపు
Image Credit : ANI

క్రెడిట్ మీకే ఇస్తా.. సపోర్టు చేయండి : ప్రధాని మోదీ పిలుపు

ప్రతిపక్షాల ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని ముక్కలుగా చూడటం మానుకోవాలని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటేనని హితవు పలికారు. "మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ నాకు వస్తుందని భయపడితే.. అది మీకే ఇచ్చేస్తాను. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్ష నేతల ఫొటోలతో ప్రకటనలు ఇస్తాను. కానీ మహిళల హక్కులను అడ్డుకోవద్దు" అని ప్రధాని అన్నారు. గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఇదని, రాజకీయ రంగు పూయకుండా బిల్లుకు సపోర్టు చేయాలని అన్నారు.

66
పెరగనున్న సభ సంఖ్య.. బిల్లు గట్టెక్కేనా?
Image Credit : Asianet News

పెరగనున్న సభ సంఖ్య.. బిల్లు గట్టెక్కేనా?

ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో నెగ్గాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, లోక్‌సభలో బిల్లు నెగ్గాలంటే కనీసం 360 మంది సభ్యుల సపోర్టు అవసరం. ఎన్డీయేకి 293 మంది బలం ఉండగా, మరో 60 నుంచి 70 మంది సభ్యుల సపోర్టు తప్పనిసరి. విపక్షాలు ఓటింగ్ సమయంలో వాకౌట్ చేసినా లేదా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా ప్రభుత్వం ఈ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల కల సాకారం కావాలంటే ఈ గండం గట్టెక్కడం అత్యంత కీలకం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image3
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Related Stories
Recommended image1
ప్రపంచంలో టాప్ 10 బిగ్ డ్యామ్‌లు ఇవే.. భారత్ నుంచి ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఇవే.. భారత్ సరికొత్త రికార్డు.. టాప్ 7లో 6 మనవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved