ఎక్కడో విజయ్ గెలిస్తే.. ఇక్కడ పవన్ ఎందుకు ట్రోల్ అవుతున్నాడు..?
Tamilnadu Assembly Election Results 2026 : ఎక్కడో తమిళనాాడులో దళపతి విజయ్ విజయం సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎందుకు ట్రోలింగ్ కు గురవుతున్నాడు..?

పవన్ కల్యాణ్ గెలిచి ఓడారా..?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది... ప్రతిపక్ష వైసిపి 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ విజయంలో హైలెట్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్ విజయం... పోటీచేసిన అన్ని స్థానాలను గెలుచుకున్నాడు. ఆ సమయంలో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పుడు ఇదే విషయంలో పవన్ ట్రోలింగ్ గురవుతున్నాడు. పోటీచేసిన 21 స్థానాల్లో జనసేన విజయం సాధించింది... అదే మొత్తం స్థానాల్లో పోటీచేసివుంటే తమిళనాడులో విజయ్ మాదిరిగానే పవన్ కల్యాణ్ కూడా అద్భుత విజయాన్ని అందుకునేవారని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే సూపర్ ఛాన్స్ ను వదులుకుని డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది... ఆయన గెలిచి ఓడారని విమర్శిస్తున్నారు. అప్పుడు ఏ విజయమైతే పవన్ ను ఆకాశానికి ఎత్తిందో ఇప్పుడు అదే విమర్శలకు కారణమవుతోంది.
దళపతి విజయ్ vs పవర్ స్టార్ పవన్ కల్యాణ్
Vijay vs Pawan Kalyan : యెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుంది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి. ఎక్కడో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ గెలవడం ఏమిటి... తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పరిస్థితి ట్రోలింగ్ కు గురవడం ఏమిటి..?. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ 100 స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాడని ఆకాశానికి ఎత్తారు... ఇప్పుడు అదే విజయాన్ని తక్కువచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ ఉన్నాయి. ఇంతకూ విజయ్ గెలుపుకు, పవన్ కల్యాణ్ కు లింక్ ఏంటి..? విజయ్ ను ఆకాశానికెత్తుతూ పవన్ పై విమర్శలెందుకు చేస్తున్నారు..?
విజయ్ ని ఆకాశానికెత్తుతున్న వైసిపి...
విజయ్ విజయం TVK శ్రేణుల కంటే YSRCP శ్రేణుల్లోనే ఎక్కువ ఉత్సాహాన్ని నింపినట్లుగా కనిపిస్తోంది. ఇంకా తమిళనాడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడనే లేదు... అప్పుడే విజయ్ ముఖ్యమంత్రి అయినట్లుగా, టివికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్లుగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వైసిపి సపోర్టర్స్ కాస్త ముందున్నారు... విజయ్ ను ఆకాశానికి ఎత్తుతూనే జనసేనాని పవన్ కల్యాణ్ పై ట్రోలింగ్ ప్రారంభించారు.
విజయ్ ది అసలుసిసలైన విజయం... దీంతో జనసేన విజయానికి పోలికేలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎవరినో గెలిపించి సీఎం చేయడం కాదు... తనను తాను గెలిపించుకున్న విజయ్ అసలైన నాయకుడు అంటున్నారు. పార్టీ స్థాపించి ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడటం లేదు... అతి తక్కువ సమయంలోనే విజయ్ విజయం సాధించాడంటూ పవన్ కల్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026
విజయ్, పవన్ కు పోలికలివే..
దళపతి విజయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ సినిమాల నుండి వచ్చినవారే. ఇద్దరూ సొంతంగా పార్టీ పెట్టి రాజకీయ ప్రభంజనం సృష్టించినవారే. అయితే విజయ్ పార్టీపెట్టిన రెండేళ్లలోనే ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి అధికారాన్ని దక్కించుకున్నాడు. కానీ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత టిడిపి, బిజెపితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అంటే విజయ్ సింగిల్ గా వెళితే... పవన్ గుంపుగా ఎన్నికలకు వెళ్ళాడంటూ వైసిపి శ్రేణుల ట్రోలింగ్.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి... డిఎంకే, అన్నాడిఎంకే పార్టీల్లాగే టిడిపి, వైసిపి పోటాపోటీ ఉంది. ఇక్కడే తమిళనాడు విజయ్, ఏపీలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తేడా ఏంటంటే విజయ్ ఒంటరిగా పోటీచేసి ముఖ్యమంత్రి కాబోతున్నాడు... కానీ పవన్ కల్యాణ్ టిడిపి, బిజెపితో కలిసి పోటీచేసి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

