MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • Thalapathy Vijay : అసలు TVK లో T అంటే ఏమిటి..?

Thalapathy Vijay : అసలు TVK లో T అంటే ఏమిటి..?

Tamilnadu Assembly Election Results 2026 : తమిళ నాడు రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దళపతి విజయ్ పార్టీ టివికే పేరు మారుమోగిపోతుంది. ఇంతకూ అసలు TVK అంటే తెలుగులో అర్థమేంటో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 04 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టివికే పార్టీ తెలుగు అర్థమేంటి..?
Image Credit : ANI

టివికే పార్టీ తెలుగు అర్థమేంటి..?

Tamilnadu Assembly Elections Result 2026 : తమిళ రాజయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ పెను సంచలనం. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం రాజకీయాల్లోకి రావాలంటే భయపడిపోయి వెనకడుగు వేసిన సమయంలో విజయ్ ధైర్యంగా ముందడుగు వేశాడు. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలను ఎదురొడ్డి నిలబడ్డాడు. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), అన్నా డిఎంకే (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా తమిళగ వెట్రి కళగం (TVK) ను స్థాపించారు... రెండేళ్లలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే స్థాయికి చేర్చి రాజకీయాల్లోనూ దళపతినే అని నిరూపించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అసలు TVK అర్థమేంటో తెలుసా..?
Image Credit : Asianet News

అసలు TVK అర్థమేంటో తెలుసా..?

తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ హీరో విజయ్ 2024, ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించాడు. ఈ పేరు చూడ్డానికి సింపుల్ గానే ఉంది... కానీ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందో తాజా విజయమే చెబుతోంది. తమిళ ప్రజలకు ఇంతలా కనెక్ట్ అయిన 'తమిళగ వెట్రి కళగం'' తెలుగు అర్థమేంటో తెలుసుకుందాం.

Related Articles

Related image1
TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!
Related image2
TVK Vijay : విజయ్ సీఎం అయితే.. డిప్యూటీ సీఎం అయ్యేదెవరు..?
36
T (తమిళగ) :
Image Credit : Chat gpt

T (తమిళగ) :

అప్పటివరకు తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీల హవా కొనసాగేది... అందుకే DMK, AIADMK పార్టీలు పార్టీపేరులో ద్రవిద పదాన్ని వాడాయి. కానీ విజయ్ అలాకాదు... ''తమిళగ'' పేరును చేర్చడంద్వారా యావత్ తమిళులను పార్టీలను భాగస్వామ్యులుగా పేర్కొన్నాడు. ఇలా తనకు రాష్ట్రంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు... ప్రజల్లోని ప్రాంతీయ అభిమానాన్ని తట్టి లేపాడు. తన పార్టీ ద్రవిడ పార్టీ కాదు యావత్ తమిళలు పార్టీ అని చెప్పేందుకు ''తమిళగ'' పదాన్ని వాడాడు విజయ్.

46
V (వెట్రి) :
Image Credit : x

V (వెట్రి) :

వెట్రి అంటే విజయం అని అర్థం. దీన్ని పార్టీ పేరులో చేర్చడంద్వారా రెండు లాభాలున్నాయి. ఒకటి విజయ్ పేరు కలిసివస్తుంది కాబట్టి అభిమానులను ఆకట్టుకోవచ్చు. ఇక పార్టీ పేరులోనే విజయం ఉందని చెబుతూ శ్రేణుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపవచ్చు. ''పార్టీ పేరులోనే విజయం ఉంది.. మనకు విజయం దక్కదా..'' అనేలా ప్రచారం సాగించేందుకు ఉపయోగపడింది.

56
కళగం (K) :
Image Credit : X

కళగం (K) :

తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలన్నీ ఈ 'కళగం' పదాన్ని వాడుకుంటున్నాయి. DMK, AIADMK మాదిరిగానే విజయ్ కూడా తన పార్టీ పేరులో కళగం వాడారు. ఓ సంస్థ లేదా సమూహాన్ని తమిళంలో కళగం అంటారు... సందర్భాన్ని బట్టి దీనిని సంస్థ లేదా పార్టీ అని అర్థం చేసుకోవచ్చు.

66
మొత్తంగా TVK అంటే...?
Image Credit : Asianet News

మొత్తంగా TVK అంటే...?

మొత్తంగా చూసుకుంటే TVK అంటే తమిళులకు విజయాన్ని అందించే పార్టీ అని అర్థం వస్తుంది. ఇలా పార్టీతోనే ప్రజల మననులు దోచుకున్నాడు విజయ్... అందుకే ఈ స్థాయి విజయం సాధ్యమవుతోంది. తెలుగు రాజకీయాల్లో నందమూరి తారక రామారావు మాదిరిగా పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే విజయ్ కూడా అధికారాన్ని చేపట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించేలా కనిపిస్తోంది. ఇప్పటికే చెన్నైలోని టివికే పార్టీ హెడ్ ఆఫీస్ ముందు కార్యకర్తలు భారీగా గుమిగూడి సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ జెండాలు ఊపుతూ, ప్రజలకు స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image3
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Related Stories
Recommended image1
TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!
Recommended image2
TVK Vijay : విజయ్ సీఎం అయితే.. డిప్యూటీ సీఎం అయ్యేదెవరు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved