MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Exit Polls : అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు రావడం లేదంటే?

Exit Polls : అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు రావడం లేదంటే?

Exit Polls : అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ శాతం పెరగడంతో ఫలితాలపై ఉత్కంఠ స్టార్ట్ అయింది. అయితే, ఎప్పటిలాగే వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఇంకా రాలేదు. ఎందుకు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 09 2026, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ వచ్చేది ఎప్పుడు?
Image Credit : our own

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ వచ్చేది ఎప్పుడు?

అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఓటింగ్ ముగిసిన వెంటనే దృష్టి సహజంగానే ఎగ్జిట్ పోల్స్ పై ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే, ఈసారి ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఆదేశాలు జారీ చేసింది.

26
ఎగ్జిట్ పోల్స్ రాకపోవడానికి అసలు కారణం ఏంటి?
Image Credit : ANI

ఎగ్జిట్ పోల్స్ రాకపోవడానికి అసలు కారణం ఏంటి?

సాధారణంగా పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే టీవీ ఛానళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటిస్తాయి. కానీ, ఈసారి అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటింగ్ పూర్తయినప్పటికీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగాల్సి ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం వల్ల ఇతర ప్రాంతాల ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. అందుకే ఈ ఆంక్షలు విధించింది.

Related Articles

Related image1
Assembly Election 2026 : షాకింగ్ ఓటింగ్ శాతం.. వర్షాన్ని కూడా లెక్కచేయని ఓటర్లు.. 3 రాష్ట్రాల్లో హోరాహోరీ !
Related image2
EPFO 3.0 : బ్యాంక్ లాగే మారనున్న ఈపీఎఫ్ఓ.. కొత్త రూల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !
36
ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు
Image Credit : ANI

ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126A ప్రకారం, ఎన్నికల కమిషన్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారంపై కఠినమైన నిషేధం విధించింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎక్కడా ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే మీడియా సంస్థలు, డిజిటల్ పోర్టల్స్ లేదా వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే రెండు విధించే అవకాశం ఉందని ఈసీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

46
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో భారీగా నమోదైన ఓటింగ్
Image Credit : Asianet News

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో భారీగా నమోదైన ఓటింగ్

ముగిసిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అస్సాంలో 85.51 శాతం, కేరళలో 78.14 శాతం, పుదుచ్చేరిలో అత్యధికంగా 89.87 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, సుమారు 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలో 140 స్థానాలకు గాను 2.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్చేరిలో 9.4 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి లక్షలాది మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయడం విశేషం.

56
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎంతవరకు నిజం?
Image Credit : Getty

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? అవి ఎంతవరకు నిజం?

ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చే ఓటర్ల అభిప్రాయాలను సేకరించి చేసే సర్వేలనే 'ఎగ్జిట్ పోల్స్' అంటారు. సర్వే సంస్థలు ఈ డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తాయి. అయితే, గత అనుభవాలను బట్టి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రతిసారీ నిజం కాలేదు. ఒక్కోసారి ఫలితాలు పూర్తిగా తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మే 2న వెలువడే అసలు ఫలితాల కోసమే రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

66
ఎగ్జిట్ పోల్స్ వచ్చే తేదీలు ఏవి?
Image Credit : Facebook

ఎగ్జిట్ పోల్స్ వచ్చే తేదీలు ఏవి?

తదుపరి విడత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 23న తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ రెండో విడత ఓటింగ్‌తో మొత్తం ఐదు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాతే అన్ని రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఒకేసారి బయటకు రానున్నాయి. అప్పటివరకు ఓటర్ల తీర్పు ఈవీఎంలలోనే ఉంటుంది. మరి ఈ భారీ పోలింగ్ ఎవరిని సింహాసనంపై కూర్చోబెడుతుందో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Assembly Election 2026 : షాకింగ్ ఓటింగ్ శాతం.. వర్షాన్ని కూడా లెక్కచేయని ఓటర్లు.. 3 రాష్ట్రాల్లో హోరాహోరీ !
Recommended image2
Assembly Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు, 5 కోట్ల మంది ఓట‌ర్లు.. దేశం దృష్టంతా అటువైపే
Recommended image3
Elections: నోటాకు మెజారిటీ ఓట్లు వ‌స్తే గెలుపు ఎవ‌రిదో తెలుసా.?
Related Stories
Recommended image1
Assembly Election 2026 : షాకింగ్ ఓటింగ్ శాతం.. వర్షాన్ని కూడా లెక్కచేయని ఓటర్లు.. 3 రాష్ట్రాల్లో హోరాహోరీ !
Recommended image2
EPFO 3.0 : బ్యాంక్ లాగే మారనున్న ఈపీఎఫ్ఓ.. కొత్త రూల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved