MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?

Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?

Viral: తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ, ఒక అబ్బాయి తప్పు చేశాడని.. ఏకంగా ఉద్యోగంలో నుంచి తీసేశారు.. అదే అమ్మాయి చేస్తే.. అందంగా ఉందని ఫాలోవర్స్ పెరిగిపోయి.. ఫేమస్ చేసేస్తున్నారు? అసలు ఏంటిది తెలియాలంటే పూర్తిగా చదివేయండి...

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇది కామెడీనా?
Image Credit : twitter

ఇది కామెడీనా?

ఈ మధ్యకాలంలో ప్రతి సిటీలో.. స్టాండప్ కామెడీలు చేస్తున్నారు. వీటికి చాలా డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ స్టాండప్ కమెడియన్స్ కి కూడా క్రేజ్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. కాలేజీ స్టూడెంట్స్, చాలా మంది యూత్ ఈ కామెడీ షోలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. కామెడీ పేరిట నోటికి ఏది వస్తే అది వాగేవారు ఎక్కువైపోయారు. కామెడీ చేసే హోస్ట్ తో పాటు యూత్ కూడా ఈ వల్గారిటీలో భాగం కావడం విశేషం. ఒకే కామెడీ షోలో ఒక అబ్బాయి తప్పుగా మాట్లాడితే ఉద్యోగం పోగొట్టేలా చేసి... అమ్మాయి తప్పుగా మాట్లాడితే.. ఫేమస్ చేసేశారు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలు ఏం జరిగింది అంటే....
Image Credit : X (@VishalMYadav_ and @ImHydro45)

అసలు ఏం జరిగింది అంటే....

రీసెంట్ గా ముంబయిలో ఫేమస్ కమెడియన్ ప్రణీత్ మోరే ఓ స్టాండప్ కామెడీ షో నిర్వహించారు. దానికి చాలా మంది యూత్ వచ్చారు.దాంట్లో ఒక అబ్బాయి కామెడీ అంటూ అమ్మాయిల బాడీ పార్ట్స్ గురించి చాలా నీచంగా మాట్లాడాడు. తాను ఒక అమ్మాయితో కలిసి డేట్ కి వెళ్లాను అని.. రూ.370 ఖర్చు చేసి బిర్యానీ కొన్నాను కానీ... తనకు మాత్రం ఆ డబ్బులకు తగినట్లు పైసా వసూల్ కాలేదని చెప్పాడు. అంటే.. తాను ఆ అమ్మాయితో కమిట్ అవ్వాలని అనుకున్నాడు కానీ.. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదని.. చాలా గలీజ్ గానే మాట్లాడు. ఆ అబ్బాయి మాటలకు అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వడం విశేషం. అతని మాటలను కండించాల్సిన హోస్ట్ కూడా ఎంకరేజ్ చేసేలా మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో... సదరు కుర్రాడిపై అందరూ విమర్శలు చేశారు. అతను చేసింది తప్పని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో.. అతని బుద్ధి మంచిది కాదు అని.. అతను పని చేస్తున్న కంపెనీ నుంచి యాజమాన్యం ఉద్యోగం లో నుంచి తీసేసింది. ఆడ పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడినందుకు మంచి పని అయ్యిందని అందరూ సంబరపడ్డారు.

ఇదే కమెడియన్ ప్రణీత్ మోరే హోస్ట్ చేసిన ఓ షోలో ఒక అమ్మాయి కూడా ఇలానే మాట్లాడింది. ఆ అమ్మాయి పేరు సెజల్ పవార్. ఆమె ఒక మెడికల్ స్టూడెంట్. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే క్రమంలో.. డెడ్ బాడీస్ తో పరిశోధనలు చేయిస్తారు. మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడాలనే మంచి కారణంతో బాడీని డొనేట్ చేస్తే.. చనిపోయిన వారి బాడీ పార్ట్స్ గురించి ఈ అమ్మాయి నీచంగా మాట్లాడింది. ముఖ్యంగా పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడటం వివాదానికి కారణం అయ్యాయి. ఒక డాక్టర్ అయ్యి ఉండి.. ఇలా ఎలా మాట్లాడింది అంటూ అందరూ విమర్శలు చేశారు. అయితే.. ఈ అమ్మాయి వీడియో వైరల్ అయిన తర్వాత విమర్శలకంటే కూడా.. అమ్మాయి అందంగా ఉందని ఎక్కువ మంది ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఇన్ స్టాలో పెద్దగా గుర్తింపే లేని ఈ సెజల్ పవార్ కి వీడియో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే 2 లక్షల మంది ఫాలోవర్స్ రావడం విశేషం.

33
అబ్బాయికి ఒక న్యాయం.. అమ్మాయికి మరో న్యాయమా?
Image Credit : X/ImHydro45

అబ్బాయికి ఒక న్యాయం.. అమ్మాయికి మరో న్యాయమా?

నిజానికి.. పై రెండు సందర్భాల్లో ఇద్దరూ చేసింది తప్పే. కానీ.. అబ్బాయిని ట్రోల్ చేసి.. అమ్మాయిని ఫేమస్ చేయడం ఎంత వరకు న్యాయం అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జండర్ ఈక్వాలిటీ కావాలి మనమే అడుగుతాం.. ఇలాంటి విషయాల్లో మాత్రం జండర్ ఈక్వాలిటీ చూడరా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. పాపం.. కొందరు రకరకాల కంటెంట్ తో.. ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి తిప్పలు పడుతుంటే.. ఇక్కడ ఈ అమ్మాయిని మాత్రం ఒక్క నైట్ లో ఫేమస్ చేసేశారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే.. ఈ వివాదం ముదరడంతో.. సెజల్ పవార్ మాత్రం క్షమాపణ చెబుతూ ఒక వీడియో విడుదల చేసింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు పడకపోవడమే కాదు.. ల‌క్ష‌ల మంది చ‌నిపోనున్నారు. భార‌త్‌లో కూడా
Recommended image2
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image3
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Related Stories
Recommended image1
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Recommended image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved