- Home
- National
- Delhi CM Oath Ceremony : ఏం పవన్ ... మరో యోగిలా తయారవుతున్నావే..: ప్రధాని మోదీ ఇలాగే అనుంటారా?
Delhi CM Oath Ceremony : ఏం పవన్ ... మరో యోగిలా తయారవుతున్నావే..: ప్రధాని మోదీ ఇలాగే అనుంటారా?
డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆయన కాషాయ వస్త్రధారణలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు... ఈ క్రమంలో ఆయనతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ఇంతకూ ప్రధాని పవన్ తో ఏ మాట్లాడి ఉంటారు?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pawan kalyan
Pawan Kalyan : పవన్ కల్యాణ్... ఒకప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే వినిపించేది. కానీ ఒక్క ఎన్నిక అతడిని జాతీయస్థాయిలో స్టార్ ను చేసింది... ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన విజయం మామూలు పేరు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు పవన్ కు చాలామంది జాతీయస్థాయి నాయకులకు లేని గుర్తింపు ఉంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'పవన్ ఓ తుఫాను' అంటూ మాట్లాడారంటేనే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా పవన్ కు ప్రధాని మోదీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మరోసారి బైటపడింది.
దేశ రాజధాని డిల్లీలోని రాంలీలా మైదానంలో డిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జనసేన పార్టీలకు కూడా ఆహ్వానం అందింది... దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ ప్రమాణస్వీకారానికి కూడా పవన్ కాషాయ వస్త్రాల్లోనే హాజరయ్యారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వేదికపైకి చేరుకుని అందరు నాయకులను నమస్కరించుకుంటూ ముుందుకువెళుతుండగా ప్రత్యేకంగా కనిపించిన పవన్ కల్యాణ్ పై ఆయన దృష్టి పడింంది. దీంతో పవన్ వద్దకు చేరుకోగానే ఆగిపోయి పవన్ తో ప్రత్యేకంగా కాస్సేపు ముచ్చటించారు... ప్రధాని ఏమన్నారోగానీ ఇలా మాట్లాడుతున్న సమయంలో పవన్ చిరునవ్వులు చిందించడం ఆసక్తిగా నిలిచింది. పవన్ పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రధాని మాట్లాడుతుండగా నవ్వుతూ కనిపించారు.
ఇలా పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో మెగా అభిమానులకే కాదు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పవన్ అంతలా నవ్వుకునేలా ప్రధాని ఏమని ఉంటారబ్బా? అనే చర్చ మొదలయ్యింది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. కాషాయ వస్త్రాల్లో పవన్ ను చూసిన మోదీ 'ఏం పవన్... నువ్వు మరో యోగి ఆదిత్యనాథ్ లా తయారవుతున్నావే' అని ఉంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ కాషాయ వస్త్రాల గురించి మోదీ కామెంట్ చేసివుంటారని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం.
ఇక పవన్ కల్యాణ్ తో పాటు అదే వేదికపై ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. చంద్రబాబుతో కరచాలనం చేసి కాస్సేపు ఆగి ముచ్చటించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగిన ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు.
Delhi CM Oath Ceremony
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మహిళా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉత్కంఠకు తెరతీస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
డిల్లీ ముఖ్యమంత్రి, మంత్రులతో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. రేఖా మంత్రివర్గంలో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, పంకజ్ కుమార్ సింగ్, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్, కపిల్ మిశ్రాలకు చోటు దక్కింది.
Delhi CM Swearing-In
డిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ఎవరెవరు హాజరయ్యారంటే..
డిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఎన్డిఏ భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు, డిల్లీ బిజెపి ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, మహారాష్ట్ర నుంచి దేవేంద్ర పడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే , అజిత్ పవార్, మధ్యప్రదేశ్ నుంచి రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా, రాజస్థాన్ నుంచి దివ్య కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వ, ఒడిశా నుంచి ప్రతిభా పరిదా, కనక్‌వర్ధన్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సా, విజయ్ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి చౌనా మెయిన్, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీహార్ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి, ప్రెస్టోన్ టిన్సోంగ్, నార్టియాంగ్ నుంచి ఎమ్మెల్యే సంగియావ్ భాలాంగ్ ధార్, నాగాలాండ్ నుంచి టిఆర్ జెలియాంగ్, యంతుంగో పాటన్ రాంలీలా స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. .