Viral Video: 18 అడుగుల కింగ్ కోబ్రా అటాక్.. వీడియో చూస్తే గుండె జారాల్సిందే
పాములు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటిలో కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే గుండె జారి గల్లంతు కావడం ఖాయం.

అసలేం జరిగిందంటే.?
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా భావువాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై ఓ కింగ్ కోబ్రా దాడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని ఒక ఇంటి ముందు గోడపై ఉన్న చెట్ల పొదల్లో కింగ్ కోబ్రాను అక్కడి ప్రజలు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.
అధికారులపై పాము దాడి
పామును పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కోబ్రా ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆ అధికారి వెంటనే కిందపడిపోయాడు. మరొకరు వెంటనే వెనక్కి తప్పించుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న వారు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. అయితే చాలా సార్లు చేసిన ప్రయత్నం తర్వాత 18 అడుగుల పొడవున్న కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అడవిలో వదిలేశారు.
సోషల్ మీడియాలో విమర్శలు
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అధికారుల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతుంటే మరికొందరు మాత్రం పాము పట్టుకున్న విధానంపై విమర్శలు కురుపిస్తున్నారు. పాము పట్టుకున్న విధానం శాస్త్రీయంగా సరైనదా అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తారు. కొందరు అధికారులు అశాస్త్రీయంగా వ్యవహరించారని విమర్శలు చేశారు.
వైరల్ అవుతోన్న వీడియో
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలో భారీగా లైక్ లు, షేర్ లు జరుగుతున్నాయి. మరెందుకు ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
पकड़ने गई वन विभाग की टीम पर किंग कोबरा का अटैक, बाल बाल बचे टीम के लोग, मुश्किल से किया काबू, रेस्क्यू कर जंगल में छोड़ा।
घटना देहरादून वन प्रभाग की झाझरा रेंज के भाऊवाला गांव की है। असाधारण लम्बाई वाले खतरनाक सांप को देखकर ग्रामीणों में हड़कंप मच गया था।#KingCobra#Dehradunpic.twitter.com/2Un4XeohqA— Ajit Singh Rathi (@AjitSinghRathi) August 30, 2025