MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే

Viral News: ఫ్రీగా వ‌స్తే ఫినాయిల్ అయినా తాగుతావా.? స‌హ‌జంగా పిసినారుల‌కు ఈ సామెత‌ను ఉప‌యోగిస్తుంటాం. అయితే తాజాగా కాన్పూర్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న చూస్తే ఈ సామెత నిజంగా నిజం అనిపించ‌క మాన‌దు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 25 2026, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాంకీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన
Image Credit : Sachin Gupta/X

పాంకీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన

కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చెత్త డంపింగ్ ప్రాంతాల్లో ఉపయోగపడే వస్తువుల కోసం కొందరు వెతకడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం గడువు ముగిసినట్లు చెబుతున్న చాక్లెట్లు, టాఫీల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాగులు, సంచులతో వచ్చిన ప్రజలు
Image Credit : Sachin Gupta/X

బ్యాగులు, సంచులతో వచ్చిన ప్రజలు

వైరల్ వీడియోలో చెత్తను పారేసిన ప్రాంతం చుట్టూ భారీగా జనం కనిపిస్తున్నారు. కొందరు నేలపై పడివున్న చాక్లెట్లు, టాఫీలను చేతులతో తీసుకుంటున్నారు. మరికొందరు ఖాళీ సంచులు, బ్యాగులు, కంటైనర్లతో అక్కడికి చేరుకుని వాటిని నింపుకుంటున్నారు. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

35
విషయం తెలిసిన వెంటనే భారీగా చేరిన ప్ర‌జ‌లు
Image Credit : Sachin Gupta/X

విషయం తెలిసిన వెంటనే భారీగా చేరిన ప్ర‌జ‌లు

స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ ఫ్యాక్టరీ నుంచి విక్రయానికి పనికిరాని చాక్లెట్లు, టాఫీలను అక్కడ పారేసినట్లు తెలుస్తోంది. వాటిలో కొన్ని గడువు ముగిసిన ఉత్పత్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడంతో కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అయితే అసలు ఆహార పదార్థాలు ఎందుకు అక్కడ పడేశారనే అంశంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

यूपी : कानपुर में किसी ने एक्सपायरी चॉकलेट, टॉफी, बिस्किट के डिब्बे कूड़े के ढेर पर फेंक दिए। लोग उन्हें भी उठाकर ले गए। pic.twitter.com/Hd8vfZVixg

— Sachin Gupta (@Sachingupta) August 25, 2026

45
తినేందుకు తీసుకెళ్లడంపై ఆందోళన
Image Credit : Sachin Gupta/X

తినేందుకు తీసుకెళ్లడంపై ఆందోళన

చెత్త కుప్ప నుంచి చాక్లెట్లు, టాఫీలను తీసుకెళ్లడం కంటే.. వాటిని తినేందుకు వినియోగించే అవకాశం ఉండటమే ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవి ఎంతకాలం క్రితం గడువు ముగిశాయి, ఎలాంటి ఉష్ణోగ్రతల్లో నిల్వ చేశారు, ప్యాకెట్లు దెబ్బతిన్నాయా లేదా అనే వివరాలు తెలియకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

55
బహిరంగంగా ఆహార వ్యర్థాల పారవేతపై ప్రశ్నలు
Image Credit : Sachin Gupta/X

బహిరంగంగా ఆహార వ్యర్థాల పారవేతపై ప్రశ్నలు

విక్రయానికి అనర్హమైన ఆహార పదార్థాలను సాధారణ చెత్తతో కలిపి బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి ఉత్పత్తులను నిబంధనలకు అనుగుణంగా సురక్షిత పద్ధతిలో పారవేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. వైరల్ వీడియోలో కనిపిస్తున్న చాక్లెట్లు, టాఫీలు నిజంగానే గడువు ముగిసినవేనా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతకాలం అక్కడ ఉన్నాయి అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Recommended image2
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Recommended image3
రెండు రోజుల్లో ఆయ‌న రాజీనామా చేయ‌క‌పోతే మ‌రో పోరాటం.. కాక్రోచ్ పార్టీ వార్నింగ్
Related Stories
Recommended image1
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved