MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఆఫీసులో మెడకు గోలుసుతో కుక్కలా ఉద్యోగి.. వైరల్ వీడియో, అసలు ఏం జరిగిందంటే?

ఆఫీసులో మెడకు గోలుసుతో కుక్కలా ఉద్యోగి.. వైరల్ వీడియో, అసలు ఏం జరిగిందంటే?

viral Kerala workplace harassment video: కేరళలో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది. విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 06 2025, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11

viral Kerala workplace harassment video: కేరళలోని కలూర్‌లో ఉన్న ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ ఉద్యోగుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నదనీ, దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారిని వీడియోలో సదరు కంపెనీలో తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగి మెడకు గోలుకు కట్టి కుక్కలా పాకించారు. ఉద్యోగి మోకాళ్లపై పాకుతూ నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయమని ఆదేశించించడం కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

ఈ ఘటనపై కేరళ కార్మికశాఖ మంత్రి వి.శివన్ కుట్టి విచారణకు దేశించారు. పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత కార్యాలయంలో వేధింపులు కాదని, సంస్థను కించపరచడానికి ఉద్దేశించిన ప్రయత్నంగా సదరు సంస్థ పేర్కొంది.

కేరళ సర్కారు కార్మిక శాఖ అధికారులు పెరుంబవూర్‌లోని కెల్ట్రాగా గుర్తించబడిన కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రాథమిక విచారణలో కూడా జరిగింది. కార్యాలయంలో వేధింపులు కాదని, కంపెనీలోని ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత విభేదాలతో ఇది జరిగిందని గుర్తించారు.

అలాగే, ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదనీ, సుమారు ఆరు నెలల క్రితం మాజీ మేనేజర్ మనాఫ్ రికార్డ్ చేసినట్టు గుర్తించారు. అయితే, ఇప్పుడు అతను అక్కడ పనిచేయడం లేదు. అతనే ఇది చేశారని చెబుతూ.. సంస్థను పరువు తీయడానికి మనాఫ్ ఇప్పుడు వాటిని లీక్ చేశాడని ఆ సంస్థ పేర్కొంది.

ఈ ఘటన జరిగిన తర్వాత విచారణ జరిపి మనాఫ్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. మనాఫ్‌కు ఉబైల్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ వీడియోను లీక్ చేశాడని తెలిపింది. పోలీసులు దీనిపై విచారణ మరింత లోతుగా జరుపుతున్నారు. అలాగే, కేరళ హైకోర్టు న్యాయవాది కులత్తూర్ జైసింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.

కేరళ ఉద్యోగి వేధింపుల వీడయో ఇక్కడ చూడండి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Recommended image2
Now Playing
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Recommended image3
Best Roads In The World: అమెరికాా కాదు.. చైనా కాదు.. ప్రపంచంలో బెస్ట్ రోడ్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved