MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!

TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!

ఎన్నికల్లో పోటీ తమకూ, డీఎంకేకు మధ్యేనని నటుడు విజయ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు దాన్ని నిజం చేసి చూపించాడు. డీఎంకే ఓటు బ్యాంకును పూర్తిగా కొల్లగొట్టాడు. డిఎంకే నుండి టివికేకు షిప్ట్ అయ్యిందెవరో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 04 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టివికె ఓటుబ్యాంక్ ఇదే..
Image Credit : Asianet News

టివికె ఓటుబ్యాంక్ ఇదే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నటుడు విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే ఇప్పటికే సెంచరీ సీట్లలో ఆధిక్యంలో ఉంది… మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. ఇక రెండో స్థానంలో అన్నా డీఎంకే ఉండగా అధికార డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతోంది. 

ఎన్నికల ప్రచార సమయంలో టివికే అధినేత విజయ్ డిఎంకే ను, సీఎం స్టాలిన్ నే టార్గెట్ చేశాడు… టివికే పోటీ అధికార పార్టీతోనే అనేలా గట్టిగా ప్రచారం చేశాడు. డిఎంకే కు ప్రత్యామ్నాాయం తామే అని ప్రజల్లోకి గట్టిగా తీసుకోళ్లాడు. ఇలా ప్రచారంలో విజయ్ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. డీఎంకే ఓటు బ్యాంకుకు టీవీకే భారీగా గండి కొట్టింది... యూత్, ఇస్లామిక్, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఈసారి టీవీకే వైపు మళ్లాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దళిత మైనారిటీ ఓటుబ్యాంకు టివికే వైపే..
Image Credit : Gemini AI

దళిత మైనారిటీ ఓటుబ్యాంకు టివికే వైపే..

ఈసారి మైనారిటీలు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యం కనబరుస్తోంది. క్రిస్టియన్లు అధికంగా ఉండే నాగర్‌కోయిల్, విళవంకోడ్, కుళచల్ వంటి నియోజకవర్గాల్లో టీవీకే ముందంజలో ఉంది. చెన్నైలోని మైలాపూర్, పెరంబూర్, ఆలందూర్, తాంబరం వంటి క్రిస్టియన్లు నివసించే ప్రాంతాల్లోనూ టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతేకాదు తిరునల్వేలి, పాళయంకోట్టై, రాధాపురంలలో కూడా టీవీకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. త్రిచీ తూర్పు నియోజకవర్గంలో విజయ్ స్వయంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.

ఇక ఇస్లామిక్‌ ఓటర్లు ఎక్కువగా ఉండే వేలూరు జిల్లాలోని వాణియంబాడి, ఆంబూర్, వేలూరు, గుడియాత్తంలలో కూడా టీవీకే హవా నడుస్తోంది. చెన్నైలోని చేపాక్-తిరువల్లిక్కేని, హార్బర్, విల్లివాక్కంలలో డీఎంకే ఓటు బ్యాంకును టీవీకే చీల్చేసింది. ఇలా డిఎంకే దళితులు, ముస్లిం మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంతో విజయ్ టివికే విజయం సాధించింది.

Related Articles

Related image1
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
Related image2
TVK Vijay: విజ‌య్ గెలుపులో వాళ్లే కీల‌క పాత్ర పోషించారా? కుటుంబ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టారా
35
ముస్లింలు టివికే వైపే...
Image Credit : Chat gpt

ముస్లింలు టివికే వైపే...

ముస్లిం ఓటుబ్యాంకు ఎక్కువగా గల రామనాథపురం, కీళకరై, కడయనల్లూరు నియోజకవర్గాల్లోనూ టీవీకే గెలుపు దిశగా సాగుతోంది. దశాబ్దాలుగా మైనారిటీ ఓట్లతో గెలుస్తూ వస్తున్న డీఎంకేకు ఈసారి గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓట్లన్నింటినీ టీవీకే తన ఖాతాలో వేసుకోవడమే డీఎంకే ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

45
టివికే విజయంలో యువత పాత్ర
Image Credit : X/ TVKPartyHQ

టివికే విజయంలో యువత పాత్ర

ఇక తమిళనాడు యువతీయువకులు కూడా విజయ్ కే సపోర్ట్ చేసినట్లు ఈ ఎన్నికల పలితాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు తీసుకువస్తానని... యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ఇలా యువతను టార్గెట్ గా చేసుకుని టివికే ముందుకువెళ్ళడం కలిసివచ్చింది.

ఇక సినిమాల ద్వారా విజయ్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది... దీన్ని కూడా టివికే పార్టీ  అనుకూలంగా మార్చుకుంది. విజయ్ పాపులారిటీని మరింత పెంచేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది టివికె. ఇలా పొలిటికల్ గానే కాదు సినిమాల పరంగా విజయ్ యువతకు దగ్గరయ్యాడు... ఓట్లన్ని గంపగుత్తగా ఆయన పార్టీకే పడ్డాయి.

55
అధికారం విజయ్ దే..
Image Credit : X/ TVKPartyHQ

అధికారం విజయ్ దే..

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118. అంటే ఏ పార్టీ ఈ మెజారిటీ సాధిస్తే వారిదే అధికారం. ఈ దిశగా విజయ్ పార్టీ టివికె దూసుకుపోతోంది.. ఇప్పటివరకు వెలువడిన పలితాల ప్రకారం టివికే కు 110 స్థానాలు, అన్నా డిఎంకే 70 స్థానాల్లో, డిఎంకే 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తుది ఫలితం కాస్త అటుఇటుగా ఉన్నా విజయ్ విజయం ఖాయంగా కనిపిస్తోంది... టివికే అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారంలోకి వచ్చిన పార్టీగా టివికే చరిత్రలో నిలిచిపోనుంది..

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Recommended image2
పాకిస్థాన్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన భార‌త్‌.. ఇస్లామాబాద్‌ ఘటనకు రియాక్షనా?
Recommended image3
Riya Ahir: వర్షంలో పోలీస్ వ్యాన్‌కు అడ్డంగా నిలబడ్డ పిల్ల.. ఇప్పుడు సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
Recommended image2
TVK Vijay: విజ‌య్ గెలుపులో వాళ్లే కీల‌క పాత్ర పోషించారా? కుటుంబ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved