తాజ్ హోటల్లో ఒక్క రాత్రికే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏడాది ఖర్చుతో సమానం
భారతదేశపు మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్. ఎంతో చరిత్ర కలిగిన ఈ హోటల్లో కేవలం ఒక్క రాత్రి వుండాలంటే ఎంత ఖర్చు ఎంతో తెలుసా?
Taj Hotels
భారతదేశంలో లగ్జరీ మాత్రమే కాదు చారిత్రక నేపథ్యంగల హోటల్లు చాలా వున్నాయి. అలాంటివాటిలో అగ్రస్థానంలో వుంటుంది ముంబైలోని తాజ్ హోటల్. భారతదేశపు మొట్టమొదటి ఫైవ్ స్టార్ హోటల్ గా ముంబై తాజ్ గుర్తింపుపొందింది. ఇలా చారిత్రక నేపథ్యం, లగర్జీ కలగలిసిన తాజ్ హోటల్ దేశవిదేశాలకు చెందిన అతిథులతో నిత్యం కలకలాడుతూ ఉంటుంది.
తాజ్ హోటల్ ముంబై సముద్ర తీరంలో రాజసం ఉట్టిపడేలా ఠీవిగా నిలబడి వుంటుంది. కనులు తిప్పుకోనివ్వని అందానికి, విలాసవంతమైన జీవనానికి ఇది ప్రసిద్ధి చెందింది. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్దనుండి చూస్తే ఈ హోటల్ మరింత అందంగా కనిపిస్తుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ముంబైలోని ఈ స్టార్ హోటల్‌లో వుండాలంటే డబ్బులు నీళ్లలా ఖర్చుచేయాల్సి వుంటుంది. దీన్ని 1903 ప్రముఖ వ్యాపారవేత్త జంషెట్జీ టాటా ప్రారంభించారు. అరేబియా సముద్ర అందాన్నే ఈ హోటల్ రెట్టింపు చేసింది.
ఇలా చారిత్రక నేపథ్యం కలిగిన ఈ తాజ్ హోటల్ ఇప్పటికీ ఏమాత్రం కల తగ్గకుండా కొనసాగుతోంది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక హోటల్లో చాార్జీలు కూడా అలాగే వుంటాయి. ఇక్కడ ఒక్క రాత్రి బస చేయడానికి చాలా ఖర్చవుతుంది. ఈ విలాసవంతమైన అనుభవం కోసం పెద్దమొత్తాన్ని ఖర్చు చేయాల్సి వుంటుంది.
తాజ్ వెబ్‌సైట్ ప్రకారం... ఓ సాధారణ గదిని బుక్ చేసుకోవడం కనీసం కనీసం 34,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఇది ప్రారంభ ధర. గది ధరలు తేదీ, సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి.
ఈ జనవరి 2025 లో నిర్ణయించిన ధరల ప్రకారం... ఓ గదికి కనీసం 34,000 రూపాయలు చూపిస్తుంది. పన్నులతో సహా, ఒక రాత్రికి దాదాపు 36 నుండి 37 వేల రూపాయలు ఖర్చవుతుంది.
హోటల్ వెబ్‌సైట్ వివిధ గది రకాలు, ధరలను జాబితా చేస్తుంది. లగ్జరీ బెడ్‌రూమ్ కోసం, ఒక రాత్రికి లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
సముద్రం వ్యూ ఉన్న గ్రాండ్ లగ్జరీ వన్ బెడ్‌రూమ్ సూట్ లో వుండాలంటే ఓ రాత్రికి దాదాపు రూ.2.7 లక్షలు ఖర్చవుతుంది. పన్నులతో కలిపి ఒక రాత్రికి మొత్తం ఖర్చు దగ్గరదగ్గర మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది. .