డబ్బాను మింగిన పాము.. ఆపరేషన్ తో తొలగింపు..
కర్ణాటకలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ పాము ఓ డబ్బాను మింగింది. ఆ తరువాత అచేతనంగా మారింది. వెంటనే ఆస్పత్రికి తరలించి, శస్త్రచికిత్స చేయించారు.
కర్ణాటక : కర్ణాటకలోని మంగళూరులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. ఓ నాకు పాము ప్లాస్టిక్ డబ్బాను మింగింది. ఇది గమనించిన కొంతమంది ఆ పామును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లగా.. ఆపరేషన్ చేసి డబ్బాను తొలగించారు.
\
ఆ తర్వాత పాము కోలుకున్నాక అటవీ విభాగంలో విడిచిపెట్టారు. కర్ణాటక మంగలూరులోని బంట్వాళ దగ్గరలో ఉన్న వగ్గలో సాలుమరద తిమ్మక్క ఉద్యానవనంలో ఈ పాము అచేతనంగా పడి ఉంది. దాన్ని స్థానికులు గుర్తించారు.
వెంటనే ‘స్నేక్ కిరణ్’ అనే వన్యప్రాణిప్రేమికుడు ఆ పామును పట్టుకుని చూశారు. ఈ క్రమంలో అదేదో గట్టి పదార్థాన్ని మింగిందని గుర్తించారు. దానివల్లే ఇబ్బంది పడుతుందని గుర్తించి... వెంటనే మంగళూరులోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
స్కానింగ్ లో చేశారు. అందులో పాము కడుపులో ప్లాస్టిక్ డబ్బా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్ట్ యశస్వి నారావి ఆ పాముకు ఆపరేషన్ చేశారు. దాని శరీరంలో ఉన్న డబ్బాను తీసేశారు.
ఆపరేషన్ తరువాత పాము త్వరగా కోలుకుంది. దీంతో దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. ఇప్పుడీ వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.