రోడ్డుపై 100 మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..
రోడ్డుపై వెడుతున్న మహిళలను లైంగికంగా వేధించి.. బైక్ పై పారిపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇప్పటివరకు అలా 100మంది మహిళలను వేదించినట్లు తెలుస్తోంది.
చెన్నై: రోడ్డుపై వంద మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ నేరస్థుడిని ఎంకేబీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు పలు సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలించారు.
ఎంకెబి నగర్‌లోని 14వ సెంట్రల్ క్రాస్ స్ట్రీట్, 16వ సెంట్రల్ క్రాస్ స్ట్రీట్‌లో జూలై 11, జూలై 24వ తేదీలలో.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత వేగంగా అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
ఆ మహిళలు పోలీసులు ఆశ్రయించడంతో... వీరి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్పాట్ విజిట్ చేశారు. అక్కడున్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని వ్యాసర్పాడి నివాసి ఎం ప్రకాష్ (43)గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి, విచారించారు.
విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. "అతను ఇద్దరు మహిళలను మాత్రమే కాకుండా, మరో 100 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
అతని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు జ్యుడీషియల్ కస్టడీని మేజిస్ట్రేట్ ఆదేశించారు.