Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్.. మరో 2 నెలల్లో భారీగా పెరనున్న జీతాలు.?
Salary: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే భారీగా జీతాలు పెరుగుతాయని ఆశతో ఉన్నారు. అయితే అది అమలు అయ్యే కంటే ముందే మరో గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది.

8వ వేతన సంఘం ముందే శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. అయినా 8వ వేతన సంఘం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ పరిస్థితిలోనే ఉద్యోగులకు ఊహించని శుభవార్త వచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. 8వ వేతన సంఘం అమలు కాకముందే జీతం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
డీఏ పెంపు లేకుండానే జీతం ఎలా పెరుగుతుంది?
సాధారణంగా జీతం పెరగాలంటే డీఏ పెంపు అవసరం ఉంటుంది. కానీ ఈసారి డీఏ పెంపు లేకుండానే చేతికి వచ్చే జీతం పెరగవచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం 2026 కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాల వల్ల నేరుగా నెల జీతం పెరిగినట్లే లాభం కనిపించే అవకాశం ఉంది.
బడ్జెట్ 2026 ప్రత్యేకత ఏమిటి?
బడ్జెట్ 2026 చాలా కీలక సమయంలో వస్తోంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇక రద్దు దిశగా సాగుతోంది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది. ఈ మార్పుల వల్ల మధ్యతరగతి, జీతం పొందే వారికి ఎంత ఉపశమనం లభిస్తుంది అనే అంశంపై ఆసక్తి పెరిగింది.
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 లో ఏమి మారుతుంది?
కొత్త చట్టం పాత ప్రయోజనాలను తొలగించడం లేదు. కానీ వాటిని చూపించే విధానం మారుతుంది. ఇంతకుముందు జీతానికి సంబంధించిన మినహాయింపులు సెక్షన్ 10, 16, 17 లలో విడివిడిగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఒకే సెక్షన్ 19 లో పట్టిక రూపంలో చూపిస్తారు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీని వల్ల ట్యాక్స్ లెక్కలు సులభంగా మారతాయి.
HRA, LTA, అలవెన్సులకు ఏమవుతుంది?
జీతం పొందే వారికి ప్రధానంగా ఉండే ప్రశ్న ఇదే. HRA, LTA, ప్రత్యేక అలవెన్సులు కొనసాగుతాయా? పాత చట్టంలో ఇవి వేర్వేరు సెక్షన్లలో ఉండేవి. కొత్త చట్టంలో వాటిని ఒకే నిర్మాణంలో చూపిస్తారు. అంటే మినహాయింపులు కొనసాగుతాయి, కానీ రూపకల్పన మారుతుంది. నిపుణుల అంచనా ప్రకారం బడ్జెట్ 2026 లో ప్రభుత్వం జీతం పొందే వర్గానికి ఊరట ఇవ్వాలంటే HRA, LTA, అలవెన్సులపై అదనపు రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే జీతం నేరుగా పెరిగినట్లు లాభం కనిపిస్తుంది.

