MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • ఉద్యోగులూ జాగ్రత్త .. ఆర్ఎస్ఎస్ కు దగ్గరైతే సస్పెండే..: మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగులూ జాగ్రత్త .. ఆర్ఎస్ఎస్ కు దగ్గరైతే సస్పెండే..: మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Karnataka : కర్ణాటక లో ఆర్ఆర్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 16 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్ఎస్ఎస్ పై ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Image Credit : Asianet News

ఆర్ఎస్ఎస్ పై ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Karnataka : కర్ణాటక రాజకీయాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పేరు మారుమోగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే... ఇలా కర్ణాటకలో కూడా జరిగాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. స్వయంగా మంత్రి హిందుత్వాన్ని వ్యతిరేకించేలా వ్యవహరించడం దారుణమని బిజెపి మండిపడుతోంది.

ఆర్ఎస్ఎస్ పై రాసిన లేఖ వివాదాస్పదం అవుతున్నా మంత్రి ప్రియాంక్ ఖర్గే వెనక్కితగ్గడంలేదు... తాజాగా ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఖర్గే హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని... ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే గట్టిగా ప్రభుత్వాన్ని సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉద్యోగులు సర్వీస్ రూల్స్ పాటించాలి
Image Credit : Asianet News

ఉద్యోగులు సర్వీస్ రూల్స్ పాటించాలి

ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్ సర్వీస్ రూల్స్ అమల్లో ఉన్నాయని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టమైన నిబంధన ఉందన్నారు. అయినా కూడా కొందరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. తన శాఖలో కూడా కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిసిందని ప్రియాంక్ ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Now Playing
ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : RSS చీఫ్ తో సమావేశమైన ముస్లిం మేధావి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ తో
Related image2
RSS Tiranga DP: ప్రొఫైల్ పిక్ ను మార్చిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌.. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు పుల్ స్టాప్
35
నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెన్షన్ ఖాయం..
Image Credit : ANI

నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెన్షన్ ఖాయం..

ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ అధికారుల గురించి ఇప్పటికే ఉన్నతాధికారులను నివేదిక కోరినట్లు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఇది అందగానే సదరు ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో ప్రస్తావించానని… ముఖ్యమంత్రి అనుమతితో ఉద్యోగులకు చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సంస్థ కార్యకలాపాలను నిషేధించాలన్న తన డిమాండ్ పై మరోసారి ఖర్గే మాట్లాడారు. ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు ఇలాంటి సంస్థలన్నింటిపై చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నానని అన్నారు. ఇలాంటి సంస్థల తమ కార్యక్రమాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నాయని... వారు ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

45
షెట్టర్ ప్రభుత్వంలోనే ఆర్ఎస్ఎస్ పై ఉత్తర్వులు
Image Credit : Getty

షెట్టర్ ప్రభుత్వంలోనే ఆర్ఎస్ఎస్ పై ఉత్తర్వులు

ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకలాపాలపై ఆంక్షల విధిస్తూ గతంలో కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఖర్గే గుర్తుచేశారు. 2012లో జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలల్లో మతపరమైన సంస్ధల కార్యకలాపాలపై నిషేధం విదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తుచేశారు. వీటిని పాటించకపోవడం వల్లే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ లాంటి సంస్ధల ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని అన్నారు.

గతంలో సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించలేదని కొందరు అంటున్నారు... ఆరోజు నిషేధం విషయంలో వెనక్కితగ్గడం సరైంది కాదనే ఇప్పుడు మేము అంటున్నామంటూ తన మాటలను ప్రియాంక్ ఖర్గే సమర్థించుకున్నారు.

55
గురుపూర్ణిమ విరాళాలపై హెచ్చరిక
Image Credit : ANI

గురుపూర్ణిమ విరాళాలపై హెచ్చరిక

ప్రభుత్వ ఉద్యోగులు విరాళాలు సేకరించడంపై ఖర్గే హెచ్చరించారు. గురుపూర్ణిమ సందర్భంగా పీడీఓల నుంచి ₹2 వేల వరకు డబ్బులు తీసుకున్నారన్నారు. మీరు మీ వ్యక్తిగత డబ్బును ఎవరికైనా విరాళంగా ఇవ్వండి…కానీ ప్రభుత్వ డబ్బును ఇవ్వకండి అని సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మంత్రి స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు.

హిందుత్వం గురించి అడిగిన ప్రశ్నకు ప్రియాంక్ ఖర్గే సమాధానమిస్తూ… 'హిందుత్వాన్ని ఎవరు తెచ్చారు? సావర్కర్ కదా హిందుత్వాన్ని తెచ్చింది?  వీళ్లు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందుత్వ వాదాన్ని తెచ్చారు'' అని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
Now Playing
ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : RSS చీఫ్ తో సమావేశమైన ముస్లిం మేధావి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ తో
Recommended image2
RSS Tiranga DP: ప్రొఫైల్ పిక్ ను మార్చిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌.. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు పుల్ స్టాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved