అయోధ్య రామయ్య నుండి అంతరిక్ష యాత్రికుల వరకు : మీ కళ్లముందుకు పీఎం మోదీ 2024 జర్నీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ జీవితంలో 2024 చాలా కీలకమైనది. ముచ్చటగా మూడోసారి పీఎం పీఠాాన్ని అధిరోహించింది ఇదే ఏడాది. అలాగే అనేక ముఖ్యమైన ఘట్టాలు కూడా ఈ సంవత్సరంలో జరిగాయి. ఇలా ప్రధాని మోదీ 2024 జర్నీకి సంబంధించిన ఆసక్తికర ఫోటోలు చూద్దాం.
Narendra Modi 2024 Journey
Narendra Modi : పాత సంవత్సరం 2024కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2025కు స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్దమయ్యింది. డిసెంబర్ 31 అంటే ఇవాళ(మంగళవారం) పాత సంవత్సరాన్ని ముగించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. జనవరి 1, 2025 (రేపు బుధవారం) దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. అయితే ఈ న్యూ ఇయర్ వేళ ప్రతిఒక్కరూ పాత సంవత్సర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ఈ సంవత్సరమంతా ఏం చేసారు? ముఖ్యమైన సంఘటనలేంటి? అనేవి నెమరువేసుకుంటారు.
అయితే సామాన్యుల జీవితంలో ఓ సంవత్సరం చాలా ఈజీగా గడిచిపోతుంది. కానీ దేశాధినేతలకు అలా కాదు... వారికి ఒక్కోరోజు ఒక్కోలా గడుస్తుంది. అలాంటి ఓ సంవత్సరకాలం అంటే ఎన్నో సంఘటనలు, మరెన్నో జ్ఞాపకాలు వుంటాయి. ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2024లో ఎలా గడిపారు? ఎలాంటి విజయాలు సాధించారు? ఈ సంవత్సర కాలంలో ఎవరెవరిని కలిసారు? ఆయనకు సంబంధించిన కీలక సంఘటనలేమిటి? అనేది తెలుసుకోవడానికి దేశ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ ఏడాది ప్రధాని మోదీకి సంబంధించిన సంఘటనలకు ప్రత్యేక ఫోటోల ద్వారా చూద్దాం.
ప్రధాని మోదీ ట్రైన్ జర్నీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉక్రెయిన్ లో పర్యటించినప్పటి ఫోటో ఇది. విదేశాంగమంత్రి జైశంకర్, అజిత్ దోవల్ తో కలిసి ట్రైన్ లో ప్రయాణించారు మోదీ.
అయోధ్య రామయ్య సన్నిధిలో మోదీ
దేశంలోని మెజారిటీ హిందు ప్రజలు కల అయోధ్య రామాలయం. అక్కడ ఆలయాన్ని నిర్మించి స్వయంగా ప్రధాని మెదీ బాలరాముడి ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు బాలరాముడికి మోదీ ప్రత్యేక చేస్తున్నప్పటి దృశ్యమిది.
లక్షద్వీప్ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్న మోదీ
ప్రధాని మోదీ లక్ష ద్వీప్ లో టూరిజంను స్వయంగా ప్రమోట్ చేసారు. అక్కడి అందమైన బీచ్ లో హాయిగా గడిపారు. దీంతో లక్షద్వీప్ అందాలు భారతీయులకు పరిచయం అయ్యాయి... దీంతో అక్కడికి టూరిస్టుల సంఖ్య బాగా పెరిగింది.
ఇస్రో కార్యాలయంలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కార్యాలయాన్ని సందర్శించారు. కేరళలోని తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో రాకెట్ ను పరిశీలిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.
మోదీ ద్వారక యాత్ర
సముద్రంలో మునిగిన శ్రీకృష్ణుడి నగరం ద్వారకను స్వయంగా వీక్షించారు ప్రధాని. సముద్ర జలాల్లోకి దిగి ఆ పుణ్యస్థలాన్ని చూసి తరించారు.
గజరాజు ఆశిస్సులు అందుకుంటూ
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలోని రంగనాథస్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఈ సమయంలోనే అక్కడి గజరాజు ప్రధానిని ఆశీర్వదిస్తున్న అపూర్వ దృశ్యమిది.
బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ
ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన బిల్ గేట్స్ తో డిజిటలైజేషన్, ఏఐ టెక్నాలజీ తో పాటు మరెన్నో విషయాల గురించి చర్చిస్తున్న ప్రధాని మోదీ
ఫ్రెంచ్ ప్రధానికి యూపిఐ గురించి చెబుతున్న మోదీ
మోదీ హయాంలో భారత్ డిజిటల్ మయం అయిపోయింది. ఒకప్పుడు ఆన్ లైన్ ట్రాన్సాషన్స్ సాధ్యంకాదనే స్థాయినుండి ఇప్పుడు కూరగాయల వ్యాపారులు కూడా యూపిఐని వాడే పరిస్థితి వచ్చింది. ఇలా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కే భారత్ లో యూపిఐ విప్లవం గురించి వివరించారు ప్రధాని.
మోదీతో ఇటలీ ప్రధాని సెల్పీ
భారత ప్రధాని మోదీ క్రేజ్ ను తెలియజేసే ఫోటో ఇది. ఇటలీ ప్రధాని మెలోని మన పీఎం మోదీతో సెల్పీ దిగుతున్న అరుదైన దృశ్యం. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
పుతిన్ తో మోదీ సరదా ముచ్చట్లు
ఇటీవల రష్యా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీకి ఆ దేశ ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్ సాదర స్వాగతం పలికారు. మాస్కోలో మీటింగ్ సందర్భంగా మోదీతో పుతిన్.
సామాన్య మహిళకు పాదాభివందనం
ఒడిషాకు చెందిన ఓ సామాన్య మహిళకు పాదాభివందనం చేసారు మోదీ. ఇలా తనకు పెద్దవారిపై వున్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఆర్మి దుస్తుల్లో ప్రధాని మోదీ
ఇది చాలా పవర్ ఫుల్ ఫోటో. గుజరాత్ తీరప్రాంతంలోని కచ్ లో నావికాదళ సిబ్బందితో దీపావళి సంబరాలు జరుపుకోడానికి ఆర్మి దుస్తుల్లో వెళుతున్న ప్రధాని మోదీ ఫోటో బాగా వైరల్ అయ్యింది.
అన్నదాతలకు గొడుగు పట్టిన మోదీ
అన్నదాతలపై మోదీకున్న ప్రేమను తెలియజేసే ఫోటో ఇది. వర్షంలో తడుస్తున్న రైతులకు స్వయంగా తానే గొడుగు పట్టారు మోదీ. ఇలా వారితో మాట్లాడుతున్న తీసిన ఫోటో ఇది.
గగన్ యాన్ ఆస్ట్రోనాట్స్ తో పీఎం మోదీ
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ గగన్ యాన్. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆస్ట్రోనాట్స్ ను ప్రధాని మోదీ కలిసారు. సాహసయాత్రకు సిద్దమైన వారితో ముచ్చటిస్తున్న మోదీ ఫోటో.