- Home
- National
- మధ్యప్రదేశ్‌లో గిరిజనులతో మమేకమైన ప్రధాని మోడీ.. ఆటపాటలకు ఫిదా, నేనున్నానన్న భరోసా (ఫోటోలు)
మధ్యప్రదేశ్‌లో గిరిజనులతో మమేకమైన ప్రధాని మోడీ.. ఆటపాటలకు ఫిదా, నేనున్నానన్న భరోసా (ఫోటోలు)
శనివారం మధ్యప్రదేశ్‌లోని పకారియా, షాదోల్‌లో గిరిజన సంఘం నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు.

modi
శనివారం మధ్యప్రదేశ్‌లోని పకారియా, షాదోల్‌లో గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక సంఘాల నేతలు, పెసా కమిటీల నాయకులు, గ్రామ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.
modi
స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్రానికి పేరు తెచ్చిన ఫుట్‌బాల్ క్రీడాకారులను మోడీ పార్కియాకు పిలిపించి చర్చలు జరిపారు. పంచాయతీలకు సంబంధించిన అంశాపైనా మోడీ గిరిజనులతో చర్చించారు.
modi
ఇదే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వింధ్య ప్రాంతంలోని గిరిజన నేతలతోనూ సమావేశమై, వారి సమస్యలు, ఇబ్బందులు, సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
modi
2047 నాటికి దేశంలో రక్తహీనతను నిర్మూలించే లక్ష్యంతో శనివారం మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
modi
గత ప్రభుత్వాలు గిరిజన సంఘాలు, పేదల పట్ల నిర్లక్ష్యం వహించాయని మోడీ ఆరోపించారు. నేడు గిరిజన మహిళ రాష్ట్రపతి కావడంపై పార్టీలు ఎలా స్పందించాయో చూశామన్నారు.