MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి, విదేశీ ఉత్పత్తులని బహిష్కరించాలి.. మోదీ సంచలన పిలుపు

మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి, విదేశీ ఉత్పత్తులని బహిష్కరించాలి.. మోదీ సంచలన పిలుపు

ప్రధాని మోదీ కొత్త జీఎస్టీ విధానాలపై దేశ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులని మాత్రమే ఉపయోగించాలని కోరారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీఎస్టీ సంస్కరణపై మోదీ ప్రసంగం
Image Credit : social media

జీఎస్టీ సంస్కరణపై మోదీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానంతో సామాన్య ప్రజలతో పాటు, వ్యాపారులకు కూడా లాభం చేకూరింది అని మోడీ అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాకారమైన వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల
Image Credit : X

సాకారమైన వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల

 కొత్త జీఎస్టీ విధానం ద్వారా వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైంది అని అన్నారు. ఇకపై దేశ ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి.. విదేశీ వస్తువులని బహిష్కరించాలి అని సూచించారు. ప్రధాని మోదీ నోట వచ్చిన ఈ మాట సంచలనమైనది అనే చెప్పాలి. 

Related Articles

Related image1
ప్రమాదానికి గురైన థగ్ లైఫ్ నటుడు జోజు జార్జ్.. జీపు బోల్తా పడడంతో గాయాలు
Related image2
ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి
35
మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి
Image Credit : Getty

మేడిన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలి

దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి అని మోదీ అన్నారు. స్వదేశీ అభియాన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించాలి అని మోదీ కోరారు. మనం ఉత్పత్తి చేసే వస్తువుల ద్వారానే దేశ గౌరవం పెరుగుతుంది అని అన్నారు. 

45
ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా
Image Credit : ANI

ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా

కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుంది అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ విధానంలో భాగంగా జీరో ట్యాక్స్, 5 శాతం ట్యాక్స్, 18 శాతం ట్యాక్స్ విధానాలు మాత్రమే ఉంటాయి. దీని ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులపై జీరో ట్యాక్స్ ఉంటుంది అనే సంకేతాలు అందుతున్నాయి. దీని వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుంది. 

55
ఏ మేరకు విజయవంతం అవుతుందో..
Image Credit : Getty

ఏ మేరకు విజయవంతం అవుతుందో..

మొత్తంగా జీఎస్టీ సంస్కరణ ప్రసంగంలో మోదీ మేడిన్ ఇండియా ఉత్పత్తులని మాత్రమే వాడాలి అని పిలుపు నివ్వడం సరికొత్త చర్చకి దారి తీసింది. గతంలో మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపుని ఇచ్చారు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులని వాడాలి అని మోదీ ఇచ్చిన పిలుపు ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Related Stories
Recommended image1
ప్రమాదానికి గురైన థగ్ లైఫ్ నటుడు జోజు జార్జ్.. జీపు బోల్తా పడడంతో గాయాలు
Recommended image2
ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved