ఆఫ్ఘాన్ సిక్కు-హిందూ ప్రతినిధులతో ప్రధాని మోడీ భేటీ...
శనివారం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో.. ఆయన ఆఫ్ఘన్ హిందూ-సిక్కు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వారికి మానవతా సాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులతో కూడిన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. శుక్రవారం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సిక్కు నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
నిరుడు ఆగస్టు మధ్యలో తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తరువాత దేశంలో ఏర్పడిన సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న మైనారిటీ సమాజాన్ని భారత ప్రధాని కలిశారు.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
భారతదేశంలోని ఆఫ్ఘన్ మైనారిటీ కమ్యూనిటీ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్న ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్... ఆఫ్ఘన్ మైనారిటీతో ప్రధాని సమావేశాన్ని శుక్రవారం ధృవీకరించారు.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
సమావేశానికి ముందు నిన్న చందోక్ మాట్లాడుతూ "ఈ సమావేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో మా సంబంధాలను పెంపొందించడంలో కీలకమైన బెంచ్‌మార్క్ పోషిస్తుంది, ఎందుకంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా, ఆర్థిక సహాయాన్ని అందించడం కొనసాగిస్తుంది." అని ఆశాభావాన్నివ్యక్తం చేశారు.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయం అందించినందుకు, ఆఫ్ఘన్ హిందూ-సిక్కు మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసినందుకు, వారి సురక్షిత తరలింపును నిర్ధారించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చందోక్ ప్రధాని మోదీకి గతంలో లేఖ రాయడం కూడా ప్రస్తావించదగిన విషయం. ఆఫ్ఘన్‌లకు గతంలో జారీ చేసిన వీసాలన్నీ దేశానికి వెలుపల ఉన్నవారికి చెల్లుబాటు కానందున, తాజాగా ఈ-వీసాలు కోరుకునే వారిని ప్రాసెస్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
ఈ లేఖలో "ప్రభుత్వం తాజా వీసాల జారీ, ప్రాసెసింగ్, LTV వీసాలుగా మార్చడం, ఆఫ్ఘన్ మైనారిటీలకు నివాస అనుమతులు, నిష్క్రమణ అనుమతుల కోసం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని.. స్థానికంగా ఎవరైనా తెలిసినవారు హామీ ఇవ్వాలన్న దాంట్లో సడలింపువ్వాలని’ కోరారు.
PM Modi met a Afghan Sikh-Hindu delegation at his residence today
అలాగే, ఏదైనా అనువైన ప్రదేశంలో "ఆఫ్ఘన్ నగర్" ఏర్పాటు ఉచితంగా భూమిని అందించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పిఎం మోడీని కోరారు.